ప్రస్తుత నాయకులు: నువ్వు ఒకటంటే నేను రెండంటా.. ఇదేనా రాజకీయం..?

MOHAN BABU
సంగారెడ్డి, ఆందోల్  నియోజకవర్గాల్లో కొనసాగిన బండి సంజయ్ పాదయాత్రతో బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్ రాజకీయాలపై జిల్లాలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సంగ్రామ యాత్ర జిల్లా దాటి అలా వెళ్లగానే బిజెపి, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. నాలుగు రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఇన్చార్జి చింత ప్రభాకర్ బీజేపీ యాత్ర పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరుసటి రోజే బిజెపి లీడర్లు తీవ్రంగా ఖండించారు. ఈ లొల్లి కాస్త వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ సంగారెడ్డి, సదాశివపేట, కొతలపూర్ లో భూకబ్జాలకు పాల్పడి స్థాయిని మించి మాట్లాడుతున్నారని బిజెపి లీడర్లు మండిపడ్డారు.


ఇందుకు టిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి రాజేశ్వరరావు దేశ్పాండే భూ ఆక్రమణలు చేశారని వాటి తాలూకు ఆధారాలు బయట పెడతామని రచ్చ  చేశారు. దమ్ముంటే నిరూపించా లని లేకుంటే  అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలి అని బిజెపి నేతలు ప్రతి సవాల్ విసరడం తో పాటు అధికార పార్టీ నేతల అసైన్డ్ ల్యాండ్ బాగోతం చిట్టా విప్పారు. మరోపక్క ఆందోల్ సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా సంజయ్ టైం పాస్ కోసం విహార యాత్రకు వచ్చారని విమర్శించారు. దీన్ని మాజీ మంత్రి బాబు మోహన్ తీవ్రంగా ఖండించారు.


స్థానికుడుగా చెప్పుకుని ఎమ్మెల్యేగా గెలిచిన క్రాంతి ఇక్కడ ఉండటం లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వేడెక్కించారు. సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పటికే గులాబీ నేతల్లో కుమ్ములాటలు ఎక్కువ అయ్యాయి. దీనికి తోడు వారి అవినీతి అక్రమాలపై బిజెపి తన స్వరాన్ని పెంచి, ప్రూఫ్ లతో సహా బయట పెడతానని ముందుకు రావడంతో టిఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. ఈ సెగ్మెంట్ పరిధిలోని సంగారెడ్డి, కొండాపూర్, కంది, సదాశివపేట మండలాల్లో ఉద్యమ టైం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న లీడర్లు, వలస లీడర్ ల కారణంగా ఇమడ లేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: