ప్రేమ గుడ్డిదే.. వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న యువకుడు?
ఇక సదరు యువకుడు తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు.. ఇందులో షాక్ అవ్వడానికి ఏముంది.. 24 ఏళ్ల యువకుడు ప్రేమలో పడి వివాహం చేసుకుంటే అందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా.. అయితే ఆ 24 ఏళ్ల యువకుడు ప్రేమించింది యువతిని కాదు 61 ఏళ్ల బామ్మని. ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది కూడా ఆమెనే . ఆశ్చర్య పోయారు కదా.. కానీ ఈ ఘటన ఇటీవల అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా పెళ్లై ఏడుగురు పిల్లలు ఉన్న ఒక 61 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇక వీరిద్దరి పెళ్లి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. అమెరికాలో వృద్ధ మహిళ షెరిల్ మెక్ గ్రెగర్ కుర్రాడు కోరాన్ మెక్కెయిన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. 2013లో వీరికి తొలిసారిగా పరిచయం అయింది. ఆ సమయంలో ఆ కుర్రవాడి వయసు కేవలం పదిహేనేల్లు మాత్రమే. ఆ తర్వాత వీరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి పోయింది. ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం పెరిగిపోయింది. ఇక ఇటీవలే ఇద్దరి జంట ఏకంగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయితే సదరు మహిళకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉండగా వీరిలో ముగ్గురు పిల్లలు యువకుడితో పెళ్లికి అంగీకరించలేదు. కాగా ఆ యువకుడికి మాత్రం ఇదే మొదటి వివాహం కావడం గమనార్హం.