అలర్ట్ : అలా చేయలేదో రేషన్ కార్డు బ్లాక్?

praveen
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం కార్డులు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే   ఇక బియ్యం కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులకు వాహనాల ద్వారా ఇంటికి వెళ్లి రేషన్ అందిస్తూ ఉండడం గమనార్హం. అయితే ప్రభుత్వం ఇలాంటి రేషన్ కార్డులు  మంజూరు చేసినప్పటికీ ఇందులో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉంటాయి.  చాలామంది అర్హులు అయిన వారు కూడా రేషన్ కార్డులు అందక ఇబ్బంది పడుతూ ఉంటే.. ఎంతో మంది అనర్హులు మాత్రం ఇలా ప్రభుత్వం నుంచి అందుతున్న కార్డు పొంది లబ్ధి పొందుతూ ఉంటారు.



 ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అందిస్తున్న బియ్యం కార్డుల విషయంలో కూడా ఎంతోమంది అనర్హులు లబ్ది పొందుతున్నట్లు ఇటీవలే ప్రభుత్వం గుర్తించింది  ఈ క్రమంలోనే బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం.  అర్హులైన వారికి మాత్రమే బియ్యం కార్డు ద్వారా లబ్ధి చేకూర్చాలని దీని కోసం అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవలే బియ్యం కార్డులు పరిశీలన కోసం పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది.



 ఇక బోగస్ కార్డుల అన్నింటినీ ఏరివేసి అసలైన అర్హులకే బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది  ఈ క్రమంలోనే బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమం లో భాగంగా మూడు నెలల నుంచి రేషన్ తీసుకోకుండా ఉన్న వారి జాబితాలను సిద్ధం చేసి ఆయా మండలాలకు పంపింది. ఇలా మూడు నెలల నుంచి రేషన్ తీసుకోకుండా ఉన్న వారు అసలు గ్రామం లోనే ఉన్నారా..  గ్రామంలోనే ఉంటే రేషన్ తీసుకోవడానికి ఎందుకు రావడం లేదు..  వారికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ తో అవసరం ఉందా లేదా అన్న విషయాలను కూడా గమనించనున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ విషయాలను అధికారులు పరిశీలిస్తారు. తగిన ఆధారాలు చూపించకపోతే బియ్యం కార్డు బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఏకంగా ఏడు లక్షల కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: