గ్రానైట్ వార్ : మరో వివాదంలో జగన్ ?

RATNA KISHORE
శ్రీకాకుళం జిల్లాలో మరో వివాదం రేగింది. ఉద్యమం త్వరలోనే  ఉద్ధృత రూపు దాల్చనుంది. టీడీపీ మాట్లాడకపోతే మనుగడ లే దు. మాట్లాడతారా లేదా అన్నదే అనుమానం? అప్పటిలా ఫైటింగ్ స్పిరిట్ ఉన్న నాయకులు ఎవ్వరూ ఇప్పుడు ఆ పార్టీలో లేరు అన్న మాట ఒకటి బలీయంగా వినిపిస్తున్న తరుణాన కొండలు  కాపాడుకోవడం మా ధర్మం అని చెబితే టీడీపీకి మైలేజీ.

కొండలు తవ్వి ఉపాధి ఇస్తామని చెప్పడంలో అర్థం లేదు. తవ్వకంతో బాగుపడేది పెద్ద పెద్ద కంపెనీలే తప్ప గ్రానైట్ తవ్వకాల కార ణంగా బాగుపడ్డ గిరిజన తండాలు ఏవీ లేవు. ఏవీ ఉండవు కూడా! గతంలోనూ తవ్వకాలు వద్దని పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగా యి. నాడు కన్నెధార కూడా గ్రానైట్ తవ్వకాలకు చెందిందే. కానీ ఉద్యమాల కారణంగా ఎర్రన్నాయుడు నేతృత్వంలో పట్టుబడిన కారణంగా ఆ పాటి అయినా ఆగాయి. ఇప్పుడు పాల కొండ ప్రాంతం కాకుండా నరసన్నపేట నియోజకవర్గ ప్రాంతంలో కొత్త వివా దం ఉంది. దీనిపై అప్పుడే ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి.

ఎప్పటి నుంచో కొండలపై వివాదాలు సాగుతునే ఉన్నాయి. కొండల తవ్వకాలు వద్దేవద్దని రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఇప్పటి దాకా అడుగుతూనే ఉన్నారు. ఈ ఒక్క విషయంలో తండ్రిని పోలిన పనులే జగన్ చేస్తుండడంలో ముందున్నారు. సూదికొండ త వ్వకాలు వద్దని (శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఉన్న కొండ ఇది) ఎప్పటి నుంచో పోరాటం సాగుతోంది. జగన్ అధికారం వ చ్చిన నాటి నుంచీ అడుగుతూనే ఉన్నారు. అయినా ఆగే పనే లేదు. మంత్రి సీదిరి అప్పల్రాజు సొంత నియోజకవర్గంలో ఇందుకు సంబంధించి కొద్ది రోజులుగా కమ్యూనిస్టుల నేతృత్వంలో జరిగిన ఉద్యమాల కారణంగా వివాదం రేగిన ఇంత వరకూ స్పందనే లే దు.
అంతేకాదు తవ్వకాలు అస్సలు ఆగను కూడా ఆగడం లేదు. తమ ప్రభుత్వం పర్యావరణానికి సంబంధిత రక్షణకు చర్యలు చేపడు తున్నామని చెప్పే నేతలు దీనిపై ఇంతవరకూ మాట్లాడనే మాట్లాడడం లేదు. ఈ వివాదం ఇలా ఉంటుండగానే మరో వివాదం వచ్చి పడింది. శ్రీకాకుళం జిల్లా, సారవ కోట మండలం, బొంతు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1 ప్రాంతంలో కలర్ గ్రానైట్ కోసం తవ్వ కాలు జరిపేం దుకు ఓ ప్రయివేటు కంపెనీ ముందుకు వచ్చింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణను జగన్ ప్రభుత్వం నిన్నటి వేళ చేపట్టింది. దీనికి జేసీ సుమిత్ కుమార్ హాజరై సంబంధిత ప్రక్రియను పరిశీలించారు. ఈ సందరర్భంగా గ్రానైట్ తవ్వకాలతో స్థానికులకు ఉపాధి ఉంటుందని చెబుతూ, కంపెనీకి వత్తాసు పలికేందుకు ఆయన ప్రయత్నించారు కానీ తమకు న్యాయం చేయలేదని ఇక్కడి గిరిజనులు అంటున్నారు. ఆవేదన చెందుతూ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతం నరసన్నపేట నియోజక వర్గం పరిధిలో ఉంది. అంటే ఇది డిప్యూటీ సీఎం దాసన్నకు చెందిన ప్రాంతం. దీనిపై మాట్లాడాల్సింది ఆయనే! కానీ ఆయన మాట్లాడడం లేదు అన్నది ఓ ఆరోపణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: