జగన్ ఎన్నికలకు రెడీ.. ఈసారి పాదయాత్ర కాదు.. ఇంటింటికి?
అయితే 2019 ముందు అధికారంలోకి రావడానికి సీఎం జగన్ పాదయాత్ర నిర్వహించారు అన్న విషయం తెలిసిందే ఇలా అచ్చం తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి తరహాలోనే పాదయాత్ర నిర్వహించి ప్రజల్లోకి వెళ్లి.. ప్రజల కష్టాలను తెలుసుకుని అందరిలో భరోసా కల్పించారు. ఈ పాదయాత్ర జగన్ భారీ మెజారిటీ సాధించేందుకు కారణం అయ్యింది. నాడు అధికారంలో ఉన్న టిడిపి ఎన్ని ఇబ్బందులు సృష్టించిన పాదయాత్ర ఆపకుండా చేశారు సీఎం జగన్. మరి ఈసారి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్ పాదయాత్ర చేస్తారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది.
అయితే ఈసారి పాదయాత్ర కాదు వినూత్న ప్లాన్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన తర్వాత అందరం మళ్ళీ రోడ్ల మీదికి వచ్చి తిరగాల్సిందే. గడపగడపకు వైసిపి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకోవాలి. కరోనా వైరస్ పరిస్థితులను బట్టి ఇక రచ్చబండ కార్యక్రమాలు స్వయంగా నేనే నిర్వహిస్తానని సీఎం జగన్ తెలిపారట. అంతేకాదు మంత్రులు ఎమ్మెల్యేలు అక్టోబర్ నుంచి సచివాలయం సందర్శించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలా ఈసారి పాదయాత్ర కాకుండా ఇంటింటికి వైసీపీ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.