టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని... రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎక్కడ? అని ప్రశ్నించారు. ఏపీని హత్యాచారాంధ్ర, అత్యాచారాంధ్రగా మార్చేశారని ఫైర్ అయ్యారు. ఒక్క చాన్స్ ఇస్తే ఎంతకైనా తెగిస్తామన్న చందంగా వైసీపీ నేతల తీరుందని... వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కిరాయి రౌడీ అని మండిపడ్డారు. పెడన నియోజకవర్గంలో అభివృద్ధిని జోగి రమేష్ గాలికొదిలేశాడని... వైసీపీకి ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామన్న ప్రబుద్ధుడు జోగి రమేష్ అని నిప్పులు చెరిగారు.
ఓటర్లను బెదిరించిన ఘటనలో హైకోర్టు చివాట్లు పెట్టినా జోగి రమేష్ కు బుద్ది రాలేదని... జోగి రమేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పెడన ప్రజలు చింతిస్తున్నారన్నారు. ల్యాండ్ , శాండ్, మైన్ మొదలు చెరువుల కబ్జా, కళంకారీ వసుళ్ల వరకూ జోగి రమేష్ చేయని దందాల్లేవ్ అని.. కమీషన్లు ఇవ్వకపోతే జైల్లో పెడతామంటూ పెడన నియోజవర్గాన్ని జోగి రమేష్ పీక్కుతింటున్నాడని ఫైర్ అయ్యారు. భీమవరానికి చెందిన శ్రీనివాస రెడ్డికి పెడనలో ఏం పని? జోగి రమేష్ కు శ్రీనివాస రెడ్డి, కొల్లాటి గంగాధర్ , మల్లిశెట్టి రాజాలు బినామీలు ఉన్నారని ఆరోపించారు.
పాలడుగు ప్రసాద్ ఎవరో జోగి రమేష్ సమాధాం చెప్పాలని... పద్నానుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంటిపై రౌడీ మూకతో వెళతావా? అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దండయాత్ర చేస్తారా? కిరాయి రౌడీలతో దాడులు చేయించి రాష్ట్రాన్ని బీహార్ గా మారుస్తారా? అని ఫైర్ అయ్యారు. మీరు కడుపుకు తినేది అన్నమా గడ్డా? మంత్రి పదవి కోసం ఇంతలా దిగజారుతావా జోగి రమేష్ అని మండిపడ్డారు. బీసీల అభివృద్ధి కోసం తెచ్చిన ఆదరణ పథకానికి తూట్లు పొడిచారని.. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూసేశారన్నారు. అమరావతి రైతుల కష్టాల గురించి ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం జోగి రమేష్ కు లేదా? అని నిలదీశారు.