పాలిటిక్స్ కు చంద్రబాబు రిటైర్మెంట్ ?

Veldandi Saikiran
తిరుపతి : చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ చేసుకోవాలని....2024 ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబు మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నానని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.  జగన్ చేసిన అభివృద్ధి వల్లే కుప్పంలో భారీ విజయం సాధించామని..  గత పాలకులు ఎన్నో ఏళ్లుగా స్థానిక పోరు జరపకుండా నెట్టుకొచ్చారని తెలిపారు మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి .  పార్టీల్లో గ్రూపులకు భయపడి చంద్రబాబు స్థానిక ఎన్నికలకు వెళ్ళలేదని... నాడు సీఎంగా ఉన్న కిరణ్ కు మార్ రెడ్డి సైతం చంద్రబాబుకు బంట్రోతుగా వ్యవహరించి ఎన్నికలు జరపలేదని మండిపడ్డారు మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి .  

అధికారం చేపట్టిన రెండేళ్ల లోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దేనని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  ఈ ఫలితాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి పనితీరుకు నిదర్శనమని అభిప్రాయం అన్నారు...  టిడిపికి, చంద్రబాబు కు వయస్సు మీరింది... లోకేష్ కు రాజకీయ ఓనమాలు తెలియవని... ఎలా డబ్బులు సంపాదించాలో మాత్రమే లోకేష్ కు చంద్రబాబు నేర్పాడని చురకలు అంటించారు.   

టిడిపి నేతలు ఇంకా రాజకీయాలు చేయడం ఎందుకు ? అని...   ఈ తరహా ఫలితాలు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదని వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  ప్రజాస్వామ్యం లో పార్టీలు ఎన్నికలను ఎదుర్కోవాలని... ఎలాగూ ఒడిపోతామని భావించే ఎన్నికలు బహిష్కరించాడని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  కుప్పంలో సర్పంచ్ ఎన్నికల్లో నూ చంద్రబాబు ఘోర పరాజయం పొందాడని...  మొన్నటి ఎన్నికల్లో కుప్పంలోనూ టిడిపి డబ్బులు పంచిందని ఆరోపణ చేశారు..    జగన్ కు సమానంగా లోకేష్ ను తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు పిచ్చి ఆలోచన అని... గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: