గూగుల్ పై సంచలన ఆరోపణలు.. దర్యాప్తులో ఊహించని నిజాలు?
ప్రస్తుతం యాప్ మార్కెటింగ్ రంగం లోనే గూగుల్ కు భారత్ రెండో అతి పెద్ద మార్కెట్ గా కొనసాగుతుంది. అలాంటి భారత్ లో అక్రమంగా మిగతా పోటీదారులను దెబ్బతీసేందుకు ప్రయత్నించింది అంటూ ఆరోపణలు రావడం సంచలనం గా మారిపోయింది. ఇక గూగుల్ పై ఆరోపణలు రాగానే వెంటనే యాపిల్ అమెజాన్ సంస్థలకు కూడా ఇలాంటి ఆరోపణలు చుట్టుముట్టాయి ఈక్రమంలోనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. యాప్ మార్కెటింగ్‌లో ఇతరులకు స్థానం కల్పించకుండా గూగుల్ లాభపడింది అని గూగుల్ పై ఆరోపణలు రాగా . ఇది చట్ట ప్రకారం నేరం. ఈ క్రమంలోనే సిసిఐ 2019లో దర్యాప్తు ప్రారంభించగా ఇటీవల ఈ దర్యాప్తు పూర్తయింది
ఈ క్రమంలోనే ఇటీవల గూగుల్ పై వచ్చిన ఆరోపణలు నిజమే అంటూ సి సి ఐ తేల్చింది. ఈ క్రమంలోనే గూగుల్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాము అన్న విషయంపై త్వరలో ప్రకటన చేస్తాము అంటూ స్పష్టం చేసింది. అయితే గూగుల్ పై ఆరోపణలు నిజం కావడంతో అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. అదే సమయంలో ఈ యాప్ మార్కెటింగ్ కట్టడికి దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం లాంటిది అటు భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుతుంది ఏ డి ఐ ఎఫ్.