పీకే టీంతో పీకేదేం లేదా... వైసీపీలో రుస‌రుస‌లు...!

VUYYURU SUBHASH
 ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు 2014 ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ టీం బాగా వ‌ర్క్ చేసింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయాక జ‌గ‌న్ పీకే తో డీల్ కుద‌ర్చు కున్నాడు. పీకేం టీం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితులు ప‌రిశీలించి చివ‌ర‌కు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య చీలిక తెచ్చి మ‌రీ జ‌గ‌న్‌ను గెలిపించింది. జ‌గ‌న్ ఏకంగా 151 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చారు. ఇక మ‌రో రెండున్న‌రేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే ఇప్పుడిప్పుడే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ప్రారంభ మైంది. అయితే ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ తెలంగాణ‌లో కేసీఆర్ లా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రీ విజ‌యం సాధించే ప్లానింగ్ కూడా స్టార్ట్ చేసేశాడ‌ని అంటున్నారు. ఈ మేర‌కు జ‌గ‌న్ మంత్రుల మ‌ధ్య జ‌రిగిన స‌మావేశంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై హింట్ ఇచ్చాడ‌ని కూడా వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ గెలుపు కోసం పీకే టీం రంగంలోకి దిగుతున్నార‌న్న వార్త‌ల‌తో వైసీపీ వ‌ర్గాలు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నాయి. మ‌నం 151 సీట్ల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను చిత్తు చేశాం.. స్థానిక ఎన్నిక‌ల‌లో అస‌లు ప్ర‌తిప‌క్షాల‌కు దిక్కూ దివాణం లేకుండా పోయింది. ఈ టైంలో మ‌ళ్లీ ఈ ఉత్త‌రాది టీంలు ఎందుకంటూ వైసీపీ వీరాభిమానులే పోస్టులు పెడుతున్నారు. మ‌న ఊళ్లో ఎలా ?  రాజ‌కీయం చేయాలో వ‌చ్చి పీకే చెప్పాలా ? అని వారు మండి ప‌డుతున్నారు. వైఎస్సార్ 2004లో గెలిచాక ఎంద‌రు ఏక‌మైనా సింగిల్గా ఎన్నిక‌ల‌కు వెళ్లి 2009లో రెండో సారి పార్టీని అధికారంలోకి తెచ్చారు క‌దా ? అని గుర్తు చేస్తున్నారు.

జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న వెన‌క ఎవ‌రు ?  లేద‌రి.. 2014లోనూ ఒంట‌రిగానే చంద్ర‌బాబు + బీజేపీ + జ‌న‌సేన కూట‌మిని ఢీ కొట్టార‌ని ఇప్పుడు ఇంత ఫుల్ స్వింగ్ లో ఉండ‌గా.. ఈ ఉత్త‌రాది టీంల‌తో ప‌ని ఎందుక‌ని వారు అధిష్టానాన్ని సోష‌ల్ మీడియా సాక్షిగా ప్ర‌శ్నిస్తున్నారు. కోట్లాది మందిని క‌లిపే సోష‌ల్ మీడియా ఉంది.. పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్య‌క‌ర్త‌లు ఉన్నారు ?  వీరిని కాద‌ని ఉత్త‌రాది టీంల‌తో మ‌న‌కు ప‌నిలేద‌ని వారు అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ నిర్ణ‌యం ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: