అచ్చెన్న కాన్ఫిడెన్స్ ఏంటి?

M N Amaleswara rao
ఇంత దారుణమైన ఓటములు వస్తున్న కూడా అచ్చెన్నాయుడు కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడుగా ఉన్నాం కాబట్టి...ఏదొకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారో లేక...నిజంగా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నారో తెలియదు గానీ...నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది టి‌డి‌పినే అని గట్టిగా చెబుతున్నారు. అలాగే టి‌డి‌పి అధికారంలోకి రాగానే వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామని అంటున్నారు. ప్రతిసారి వైసీపీ వాళ్ళకు వడ్డీతో సహ అన్నీ తిరిగి ఇస్తామని చెబుతున్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌లు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాకపోతే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాల తర్వాత వారిద్దరు పెద్దగా స్పందించలేకపోయారు.

కానీ ఇలా వరుసగా దారుణమైన ఓటములు వచ్చినా సరే అచ్చెన్న దూకుడు తగ్గలేదు. ఓటమిని ఒప్పుకోకుండా దమ్ముంటే...జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్నారు. అంటే స్థానికంలో గెలవాలని పార్టీ సాధారణ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని అచ్చెన్న అనుకుంటున్నారో అర్ధం కాకుండా ఉంది. అసలు టి‌డి‌పి గెలుపుపై ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటనేది ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.

తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టి‌డి‌పి మాజీ జెడ్‌పి‌టి‌సి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, వారి వాహనాలకు నిప్పు పెట్టారు. అలాగే ఇంటిపై రాళ్ళు రువ్వారు. ఈ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. అయితే ఈ అంశంపై న్యాయ పరంగా పోరాటం చేయాలి. అలా కాకుండా అచ్చెన్న డైలాగులు వేస్తున్నారు.

నెక్స్ట్ వచ్చేది టి‌డి‌పి ప్రభుత్వమే అని, అప్పుడు వైసీపీ వాళ్ళు చంద్ర మండలంలో దాక్కున్న వదిలే ప్రసక్తే లేదని అచ్చెన్న అంటున్నారు. మరి టి‌డి‌పి అధికారంలోకి వస్తుందని అచ్చెన్న అంత స్ట్రాంగ్‌గా ఎలా చెప్పేస్తున్నారు. ఇప్పటికే స్థానిక పోరులో దారుణమైన పరాజయాలని చవిచూశారు. అయినా బాగా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి డైలాగులు వేయడం మానేసి...పార్టీ బలోపేతానికి కృషి చేస్తే కొద్దో గొప్పో పార్టీకి బెనిఫిట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: