మారని లోకం తీరు.. ఆలయంలోకి వెళ్లాడని ఏం పనిష్మెంట్ ఇచ్చారో తెలుసా ?

praveen
అనాగరికత నుంచి ప్రతి ఒక్కరూ నాగరిక సమాజంలో కి అడుగులు వేస్తున్నారు. దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. మనిషి జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి.  ఒకప్పటి కుల వివక్షలు దాదాపుగా ఎక్కడా కనిపించడం లేదు..  ఇక ఒకప్పటిలా మూఢనమ్మకాల ఊసు ఎక్కడ వినిపించడం లేదు.  ప్రస్తుతం నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బ్రతిక గలుగుతున్నారు.  ఒకప్పుడు దళితులు ఆలయంలోకి ప్రవేశించకూడదు అనే ఒక ఆచారం ఉండేది. కానీ ఇప్పుడు నాగరిక సమాజంలో మాత్రం దాదాపుగా  ఇలాంటి ఆచారం కనిపించకుండా పోయింది అనే చెప్పాలి.

 అయితే కొన్ని ప్రాంతాలలో నాగరిక సమాజంలో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ మనిషి ఆలోచన తీరు మాత్రం అక్కడే ఆగిపోయింది అన్నది అర్ధమవుతుంది. ఇంకా ఆలయాల్లో కి దళితులు ప్రవేశిస్తే అపచారం జరిగిపోయింది అని భావించే ప్రాంతాలు కూడా ఉన్నాయి అన్నది ఇక్కడ జరిగిన ఘటన చూస్తే తెలుస్తోంది.  ఇంకా నాగరిక సమాజంలో కూడా దళితులు ఉన్నత కులస్థులు అనే ఒక వివక్ష కొనసాగుతూనే ఉంది అన్నది ఈ ఘటనతో  అర్థమవుతుంది.  ఏకంగా ఆలయంలోకి ఒక దళితుడు ప్రవేశించాడు అన్న కారణంతో 23 వేల జరిమానా విధించారు.

 ఈ ఘటన కర్ణాటకలోని మియాపూరా లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. కర్ణాటకలోని మియాపూర ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదు. ఇక ఇటీవల ఒక వ్యక్తి తన రెండేళ్ల కొడుకు పుట్టినరోజు సందర్భంగా గుడి కి తీసుకెళ్ళాడు. అయితే సదరు వ్యక్తి బయటనుంచే దేవుడిని మొక్కుతూండగా.. చిన్నారి లోపలికి వెళ్లి లోకి వచ్చాడు. ఇక ఈ విషయం అక్కడి అగ్ర కులస్తులకు తెలిసింది. ఒక దళితుడు ఆలయంలో అడుగు పెట్టడంతో ఆలయం మొత్తం అపవిత్రం అయ్యిందని శుద్ధి చేయడానికి 20 వేల రూపాయలు చెల్లించాలి అంటూ బాలుడు తండ్రికి జరిమానా విధించారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసులు అతడు జరిమానా కట్టకుండా చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: