జగన్ సర్కార్ పై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి నిప్పులు చెరిగారు. టీటీడీ బోర్డు పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని కోర్టు సస్పెండ్ చేయడం మంచి పరిణామమని.. రాబోయే రోజుల్లో కొట్టివేయ బడుతుంది... అనే దాంట్లో అనుమానం లేదన్నారు. కేసులు వెనుక ఎటువంటి కుట్రలు లేవు...భక్తుల మనోభావాలను కాపాడడం కోసం కేసు వేశామని వెల్లడించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కి తగిన నిధులు లేవు... హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో ఎవరిని నియమించకుండా వ్యాపారాలు చేసుకునే వారిని నియమిస్తున్నారని ఫైర్ అయ్యారు. భగవంతుడి సేవలో మంచివారిని నియమించండి.. టీటీడీ జాయింట్ ఈవో పోస్ట్ రాజ్యాంగ ప్రకారం ఉంది.
కానీ..అదనపు ఈవో పోస్టు లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ విదంగా టీటీడీ అదనపు ఈవో ను నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీ లో ఎన్నో లొసుగులు ఉన్నాయి.. ఏ అపచారం జరిగిన స్వదేశీ సేన తరపున ధర్మ పరిరక్షణ కొరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నన్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడం పై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్ వేశానని... ఇప్పటి వరకు కేసు విచారణకు రాలేదన్నారు. సీబీఐ పిటిషన్ కూడా వేయకుండా ఎందుకు కాలక్షేపం చేస్తున్నారో అర్ధం కావడం లేదని... ఆవా భూముల్లో అక్రమాల్లో ముందస్తు చెక్కులు కూడా తీసుకున్నారు అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారని పేర్కొన్నారు.
ఎ
మ్మెల్యే ఆవా భూముల్లో అవినీతి జరిగింది అని అన్నారు...విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మార్గాన్ని భరత్ సత్తా చూపిస్తా అని అన్నారు...రెండు నియోజకవర్గాల బాధ్యత తో పాటు సీఎం జగన్ రెండు రాష్టాల బాధ్యత కూడా ఇస్తారేమేనని ఎద్దేవా చేశారు. 21 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుకున్నారు అని అంటున్నారని... యావత్తు ప్రపంచంలో ఇది ఒక రికార్డ్ అని అంటున్నారన్నారు. బాధ్యత రాహిత్యంగా కొందరు మంత్రులు, పోలిసులు మాట్లాడుతున్నారని.... డ్రగ్స్ అనేది జాతీయ సమస్య దీని పై ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగిందని వెల్లడించారు. ఎంతోమంది యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని పేర్కొన్నారు....