జ‌నంలోకి జ‌గ‌న్‌.. వెనుక ప్లాన్ ఇదేనా...?

VUYYURU SUBHASH
త్వ‌ర‌లోనే తాను.. జ‌నంలోకి వ‌స్తానంటూ.. ఏపీసీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీనికి సంబం ధించి ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు. డిసెంబ‌రు నుంచి తాను ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్న‌ట్టు తాజాగా వెల్ల డించా రు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అలెర్ట్ కావాల‌ని.. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని అన్నారు. గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌ల‌ను.. ప‌ట్టించుకోవాల‌ని.. ప‌ర్య‌వేక్షించా లని కూడా ఆదేశించారు. అయితే.. ఉన్న‌ట్టుండి.. జ‌గ‌న్ ఈ ప‌ర్య‌ట‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక అస‌లు వ్యూహం ఏంటి? అనేది చ‌ర్చ‌గా మారింది.
వ‌చ్చే ఏడాది మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శాంత్ కిశోర్‌.. టీంను రంగంలోకి దింపుతున్నారు. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఎలాంటి ఆలోచ‌న ఉంద‌నే విష‌యాన్ని పరిశీలించ‌నున్నారు. అదేస‌మ‌యంలో.. ప్ర‌జానాడి ని బ‌ట్టి.. త్వ‌ర‌లోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కూడా వెళ్లే వ్యూహంతో జ‌గ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యం లో ఇప్పుడు జ‌గ‌న్ జిల్లాల పర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. పైకి వార్డు స‌చివాల‌యాల సంద‌ర్శ‌న‌కే అని చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం.. పార్టీ నేత‌ల దూకుడుకు క‌ళ్లెం వేయాల‌నే ఉద్దేశంతో.. జ‌గ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం.. ప్ర‌స్తుతం ఇప్పుడు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా ఉంది.
అయితే.. నేరుగా ఈ విష‌యాల్లో జ‌గ‌న్ జోక్యం చేసుకుంటే.. పార్టీపై వ్య‌తిరేక‌త ఉంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. అలాగ‌ని.. త‌న వ‌ద్ద‌కే నేత‌ల‌ను పిలిపించుకుని చ‌ర్చించినా.. పంచాయ‌తీలు పెరుగుతాయి. సో.. త‌నే క్షేత్ర‌స్థాయిలోకి వెళ్తే.. ప‌రిస్థితులు వాతంట‌త అవే స‌ర్దుకుంటాయ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. జ‌గ‌న్ ఎక్క‌డిక‌క్క‌డ జిల్లాలు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌డంతో పాటు అక్క‌డ ప‌నితీరు స‌రిగా లేని వారికి వార్నింగ్ లు ఇవ్వ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో వారిని ప‌క్క‌న పెట్టేస్తాన‌ని చెప్ప‌డం ద్వారా వారిని కంట్రోల్ చేయ‌డమే జ‌గ‌న్ మెయిన్‌ టార్గెట్ గా క‌న‌ప‌డుతోంది.
అంటే.. త‌నే రంగంలోకిదిగితే..వ‌ర్గ‌పోరు త‌గ్గుతుంద‌ని.. పార్టీని గాడిలో పెట్టేందుకు స‌రైన స‌మ‌య‌మ‌ని.. జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిణామ‌మే.. ఇప్పుడు ఆయ‌న‌ను జ‌నాల్లోకి వ‌చ్చేలా చేస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: