గబ్బిలాల్లో మరో కరోనా వైరస్.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..!
ఫ్రాన్స్‌లోని పాశ్చర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లావోస్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను తమ పరిశోధనల్లో కనిపెట్టారు వీరు. ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 వైరస్‌కు జన్యుపరంగా పోలి ఉన్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌కు అతిదగ్గరగా ఉన్న రెండో రకం వైరస్ అని వెల్లడించారు. అయితే, గబ్బిలాల్లో ఉన్న కరోనా వైరస్ లు ఎన్ని.. వాటిల్లో మనుషులకు ఎన్ని సోకేందుకు అవకాశం ఉంది.. అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
ఈ పరిశోధనలకు చిన్న గబ్బిళాలు, అలాగే గుహల్లో ఉండే గబ్బిళాల మూత్రం, మలంతో పాటు అవి నివసించే ప్రాంతాల్లో నుంచి నమూనాలను సేకరించారు. విటి పరిశీలన అనంతరం SARS-CoV-2 వైరస్‌లో ఉండే జన్యుపరంగా దగ్గరగా ఉండే వైరస్‌లను ఆ గబ్బిళాల్లో గుర్తించారు పరిశోధకులు. ఈ అధ్యయనంలో SARS-CoV-2, ఎలోయిట్ వైరస్లు మధ్య ప్రముఖ తేడాలు ఉన్నాయని గుర్తించారు. కరోనా వైరస్ పుట్టుకకు ఉన్న మూలాన్ని గుర్తించడంలో వీరి పరిశోధనతో కీలక ముండుగు పడిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిన కొవిడ్ సజీవ గబ్బిలాల నుంచి వచ్చి ఉండవచ్చనే సిద్దాంతాన్ని కొద్ది వరకు ధృవీకరిస్తున్నారు పరిశోధకులు.