హుజురాబాద్ లో ఈటెల గెలుపు ఖాయమేనా..?

MOHAN BABU
రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి.. ప్రశ్నించే గొంతు నొక్కేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఆ కుట్రలు అమలు బాధ్యతను మంత్రి హరీష్ రావు భుజాన వేసుకున్నాడు అని విమర్శించారు. ఉప ఎన్నికల్లో తనను ఓడించాలనే కుట్రలో భాగంగానే అనేక పథకాలకు రూపకల్పన చేస్తూ ఆగమేఘాలమీద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందన్నారు.గురువారం పట్టణంలోని మధువని గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల 22 రోజులుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుల సంఘాల వారిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దావతు లను ఏర్పాటు చేసి స్వయంగా మందు పోసే స్థాయికి దిగజారారు అని ఎద్దేవా చేశారు.

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను కొనుగోలు చేస్తూ నీచ  స్థాయికి దిగజారి అని దుయ్యబట్టారు.వారి వెంట ప్రజలు తిరుగుతున్న మనసంత ఈటల వైపే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తటస్తులు, ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులకు బలవంతంగా గులాబీ కండువాలు కప్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదన్నారు.

కుల సంఘాలు, గుడులు, కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి జారీ చేస్తున్న జీవోలు వారి మీద ప్రేమతో కాదని, కేవలం హుజురాబాద్ లో జరిగే శాసనసభ ఉప ఎన్నికల్లో గెలుపొందాలనే కుట్రలో మాత్రమే భాగమేనన్నారు. పేదల గొంతుకైనా ఈటెల ను ఓడించాలనే వందలాది జీవోలు విడుదల చేస్తున్నారని  ఆయన అన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎంకు భూములు అమ్మితే తప్ప ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా హుజూరాబాద్ నియోజకవర్గం లోని ప్రజల హృదయాల్లో తనకున్న స్థానాన్ని చెరిపి వేయలేరని, వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: