అందరూ చూస్తుండగా.. గాల్లో నాలుగు శవాలు..!

NAGARJUNA NAKKA
తాలిబన్లు రాక్షస పాలన మొదలు పెట్టేశారు. కేవలం అధికారం చేపట్టి నెలరోజులు అయింది అంతే.. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఎదురిస్తే చంపేయం.. కనిపించినోళ్లను ఇష్టమొచ్చినట్టు కొట్టడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే అక్కడి జనాలు వణికిపోతున్నారు. ఇక మహిళల విషయానికొస్తే రోజుకో ఆంక్షను విధిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఓ నలుగురి పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహించారు.
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడి కేవలం నెలరోజులే. తాము ప్రజల పక్షం అని చిలుకపలుకులు పలుకుతూనే కత్తులు నూరుతున్నారు తాలిబన్లు. తమకు వ్యతిరేకంగా ఎవరు కనిపించినా.. వెంటనే శిక్షలు అమలు చేస్తున్నారు. మూకుమ్మడిగా దాడులు చేయడం.. చంపి.. ఆ శవాలతో ఆటలు ఆడటం లాంటివి చేస్తున్నారు. ఇదంతా ప్రజల చూస్తుండగానే బహిరంగంగా జరిగిపోతోంది. దీంతో అక్కడి వాసులకు వణుకుపుడుతోంది. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఏం చేయలేని దుస్థితి ఉండిపోతున్నారు. తాలిబన్లు చెప్పించే శాసనం.. ఎదురు తిరిగారో.. వారి ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు.
ఆ దేశంలో మానవ హక్కులు హరించిపోతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని అణగదొక్కేందుకు తాలిబన్ ఫైటర్లు గన్ లు ఎక్కుపెట్టే ఉన్నారు.
20 సంవత్సరాల క్రితం తమ హయాంలో సాగిన అరాచక పాలనను ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. బహిరంగంగానే శిక్షలు విధిస్తున్నారు. చేసిన నేరాన్ని బట్టి.. కాళ్లను.. చేతులను నరికే భయంకర శిక్షకు పూనుకుంటున్నారు. ఇలాంటి శిక్షలపై యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కానీ తాలిబన్లకు ఇవేవీ పట్టవు.
తాజాగా హెరాత్ నగరంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురికి మరణశిక్ష విధించారు. ఆ కిడ్నాపర్లను కాల్చి చంపిన తాలిబన్లు.. మృతదేహాలను క్రేన్లకు కట్టి నగర కూడళ్లలో వేలాడదీశారు. ఒక వైపు రక్తం కారుతూ.. క్రేన్లకు వేలాడుతున్న శవాలను చూసి జనాలు భయాందోళనకు గురయ్యారు. బహిరంగ శిక్షలను అమలు చేస్తామని.. ఇటీవల ప్రకటించి నతాలిబన్లు వాటిలో కాళ్లు చేతులు నరకడం లాంటివి కూడా ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: