తిరుపతిలో.. మళ్ళీ వైసీపీయేనా.. !

Chandrasekhar Reddy
తిరుపతిలో ఉపఎన్నికలో పలు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన విషయం చూశాం. అయినా అధికార వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం ఆ పార్టీ బలానికి చిహ్నం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన పేరుతో చేసిన ప్రయోగాలు సత్ఫాలితాలు ఇచ్చినట్టే అని ఈ ఫలితాలు చెబుతున్నాయి. గత ఎన్నికలలో అవకాశం అడిగిన వైసీపీ కి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల ప్రచారానికి వస్తే చెప్పినవి చేశాకే అని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు అధికారంలో ఉండగా మేనిఫెస్టో లో చెప్పినవి అన్ని ప్రజల గడపాలకే చేర్చాడు. అందుకే ఇక ప్రచారంలో జగన్ ఓట్లు అడగటం సులభం అవుతుంది. చెప్పింది చేశాకే ఓట్లు అడుగుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ వైసీపీకి సానుకూలంగా నిర్ణయం తీసుకొంటారు అనేది ఆ పార్టీ విశ్వాసం.
ఈసారి కూడా గత ఎన్నికలలో గెలుపు కంటే గొప్పగా గెలవాలని వైసీపీ యోచిస్తుంది. పనిచేసిన ప్రభుత్వంగా అది హక్కు కూడా, అదే సాధించడానికి మళ్ళీ తెరపైకి కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా ఏపీకి పిలిపించారు కూడా. ఒకపక్క జగన్ చేసిన పనులు, మరో పక్క కిషోర్ వ్యూహాలు వెరసి వైసీపీ కి మరో బ్రహ్మాండమైన విజయం సిద్దించగలది వారి అంచనా. అదే స్థాయిలో పార్టీలో కూడా అంతర్గత విభేదాలు ఎక్కడ లేకుండా చూసుకుంటూ, ప్రజల వద్దకు వెళ్లాల్సిన ప్రతి పధకాన్ని సచివాలయాలు ద్వారా అందిస్తూ కరోనా సమయంలో మంచి పాలన చేసినట్టు నిరూపించుకున్నాడు జగన్.
ఈ నేపథ్యంలో తదుపరి ప్రధాన ఎన్నికలలో కూడా వైసీపీ గెలుపు నల్లేరుపై నడక మాదిరే ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈసారి కూడా గెలిస్తే, ఇంకొన్ని మంచి పనులు చేసేందుకు ఈసారి మేనిఫెస్టో లో కూడా మార్పులు చేయొచ్చు అనేది పార్టీ వర్గాల మాట.  ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారికి అవి అందించడానికి అనుక్షణం జగన్ కృషి చేస్తున్నారు. ఇక విపక్షాలు చేసే రగడ ప్రజలలో పెద్దగా ప్రభావితం చూపకపోగా, జగన్ పై మరింత సానుభూతి తెస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో ఈసారి వైసీపీ గెలుపు ఎంత గ్రాండ్ గా ఉంటుందో, విపక్షాలకు డిపాజిట్లు కూడా మిగలకపోవచ్చనేది నిపుణుల అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: