మరో అవకాశం ఇవ్వండి.. మాజీ ఐఎస్.. !
మరి ఇస్లామిక్ స్టేట్ లాంటి భయంకరమైన తీవ్రవాద సంస్థల నుండి కూడా బయటకు వచ్చిన వారు ఉన్నారా.. ఉంటె వాళ్ళను బ్రతకానిస్తున్నారా.. అలా బయటకు వచ్చిన కారణాలు ఏమిటి.. వాళ్ళను ప్రజలు ఎలా స్వాగతించారు.. ఇలాంటి ప్రశ్నలు వస్తుండటం సహజమే. తాజాగా అలాంటి మహిళ తనకు మరో అవకాశం ఇస్తే తీవ్రవాదం పై పోరాడటానికి సాయపడతాను అంటుంది. ఇటువంటి భయంకరమైన తీవ్రవాద సంస్థలో భాగం అయినందుకు జీవితాంతం పశ్చాత్తాప్పడుతున్నట్టు ఆమె తెలిపారు. మరో అవకాశం ఇస్తే బ్రిటన్ ప్రభుత్వానికి ఉగ్రవాదం పై పోరాడటానికి సాయం చేస్తాను అంటుంది ఆమె.
మరో అవకాశం ఇస్తే తాను ప్రజలకు ఉపయోగపడతానని, సిరియా లాంటి శిబిరాలలో మగ్గిపోతూ ఉండటం భరించలేనని ఆమె అంటున్నారు. కేవలం 22ఏళ్లకే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో మెరుగైన పాత్ర పోషించినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆమె పై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమే అని, అందుకే అవకాశం ఇస్తే నిరూపించుకుంటానని అంటున్నారు. ఐఎస్ కోసం పనిచేసినందుకు ఈమె పౌరసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. బంగ్లా మూలాలు ఉన్న బ్రిటన్ పౌరురాలు షామియా బేగం. ఆమె పదిహేనవ ఏట స్నేహితులతో కలిసి సిరియా పారిపోయింది. అక్కడ అందరూ ఐఎస్ లో చేరి శిక్షణ పొందారు.