కేసీఆర్ ప్లాన్‌తోనే హుజురాబాద్ ఎన్నిక‌లు రంగులు మార్చుకుందా..?

Paloji Vinay
రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక న‌గారా మోగింది.. షెడ్యూల్ కూడా విడుద‌ల‌యింది. అయితే, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లి ప‌ర్య‌ట‌న వెనుక ఏదైనా మ‌ర్మం ఉందా అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే రెండు సార్లు ఢిల్లీ కి వెళ్లారు. అది కూడా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే.. మొద‌ట సారి వెళ్లినపుడు ఉప ఎన్నిక ఆగిపోయింది. ఇక రెండో సారి వెళ్లారు.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. అయితే, ఇప్పుడు ఈ చ‌ర్చ రాష్ట్ర రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది. నిజంగా ఉప ఎన్నిక కోసం అయితే ఆనాడు కేసీఆర్‌కు అనుకూలంగా లేని వాతావ‌ర‌ణం ఇప్పుడు అనుకూలంగా మారిందా అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

 
   అప్పుడు ద‌ళిత‌బంధు పూర్తి స్థాయిలో అంద‌రికీ చేర‌లేదు. ఇప్పుడు దాదాపు అంద‌రికీ అందింది. అలాగే ఈట‌ల క్యాడ‌ర్‌ను అంతా ప‌ద‌వులిచ్చి కొంద‌రిని, ప్రలోభాలు పెట్టి కొంద‌రిని త‌మ వైపు లాగేసుకున్నారు. ద‌ళితులు మాత్ర‌మే ఈట‌ల‌కు స‌పోర్ట్ అని భావించి వారిని ద‌ళిత బంధు తో మ‌చ్చిక చేసుకున్నారు. అలాగే హ‌రీష్ రావ్ హుజురాబాద్ లోనే తిష్ట వేర్చుకుని కూర్చున్నారు. ఇక కేసీఆర్ ఢిల్లి వెళ్లి అక్క‌డి పెద్ద వాళ్ల‌తో చేస్తున్న మంత‌నాల వ‌ల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక రంగులు మార్చుకుంటుంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.


    ఈ అనుమానాల‌కు తావిస్తూ రాష్ట్ర బీజేపీ నేత‌లు ఎవ‌రూ కూడా ఈట‌ల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. నిజంగా ఈట‌ల‌ను బీజేపీ ఒంట‌రి వాడిని చేసింద‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. అయినా, త‌న కాళ్ల మీద నిల‌బ‌డి ఒంట‌రిగా ప్ర‌చారం చేసుకుంటూ మొక్క‌వోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఒక‌వేళ కేసీఆర్, బీజేపీ క‌లిసిపోతే ఈట‌ల‌కు భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మతుంద‌నే చెప్పాలి. ఇదే జ‌రిగితే చివ‌రి నిమిషంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలి లేకుంటే.. బీజేపీ లోనే చావో రేవో తేల్చుకోవాలి. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌వ‌డంతో పార్టీల్లో ఖంగారు నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: