2024 లో దేశ వ్యాప్తంగా, ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎంపీ చింతా మోహన్ . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 85 లక్షల మందికి స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడుతున్నారని... ఎస్సి, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు నానా అవస్థలు పడాల్సి వస్తోందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. 6 తరగతి నుంచి స్కాలర్ షిప్ తీసుకున్న వ్యక్తిగా ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసని... రాష్ట్రంలో రెండేళ్ళు గా స్కాలర్ షిప్పు లు ఎవరికి ఇవ్వడం లేదని తెలిపారు.
ఫీజులు , మెస్ బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేక కళాశాలల కు ఎలా వెళ్లాలన్న ఆందోళన వ్యక్తం అవుతోందని.. కేంద్రం నుంచి వీరికి వచ్చే నిధులు వేరే పథకాలకు దారి మళ్ళాయన్నారు. ఎస్సి,ఎస్టీ,బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు రావడం లేదని.... వెనుకబడిన వర్గాలకు ఆర్ధిక ఉన్నతి కల్పించే ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లు నిర్వీర్యం అయిపోయాయని వెల్లడించారు. అవి సున్నా చేశారని...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడుందో అర్ధం కావడం లేదని మండిపడ్డారు.
అణగారిన వర్గాల ఆర్ధిక స్థోమత ఇచ్చే సంస్థలవని... కేంద్ర ప్రభుత్వం లోనూ ఆ సంస్థలు ఉన్నాయని స్పష్పం చేశారు. వాటి నుంచి వచ్చిన నిధులు అన్నీ దారిమళ్లిస్తున్నారని... ఆయా సంస్థల నిధులు దారి మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని తెలిపారు. నవంబర్ 1 తేదీలోగా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని... ఆ స్కాలర్షిప్ లు తీసుకునే ఐఏఎస్ ఐ,పి ఎస్ లు అయ్యారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 75 శాతం ఇచ్చేసిందని... రాష్ట్రంలో ఉన్న sc, st మంత్రులు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గా ఆయన విధులు సరిగ్గా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు, రోడ్లు, పోర్టులు అమ్మేయడం ఏంటని ఫైర్ అయ్యారు. పెట్రోల్ ధరలు పెరిగాయని.. నల్ల చట్టాల పై రైతుల ఆందోళనలు ఇవన్నీ మోడీని గద్దె దింపుతాయన్నారు.