లాల్ బహదూర్ శాస్త్రి చిన్న తనంలోనే ప్రాణాలకు తెగించి...

VAMSI
మాజీ ప్రధాని మరియు స్వాతంత్ర్య సమరయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి గురించి చాలా మందికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఈయన 2 అక్టోబర్ 1904 వ సంవత్సరంలో జన్మించాడు. ఇతను గాంధీజీ మరియు నెహ్రూ లకు ఎంతో నమ్మకమైన అనుచరుడు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ తో పాటు పాల్గొని ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. 1947 వ సంవత్సరంలో స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఏర్పాటు చేసిన భారతీయ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. అలా నెహ్రూ నాయకత్వంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించాడు. నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ఒకరికి ఒకరు ఎంతో స్నేహం ఉండేవారు. ఈ స్నేహం కారణంగానే తర్వాత దేశానికి రెండవ ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడ్డాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ద సమయంలో దేశాన్ని ఎంతో సామర్ధ్యంగా నడిపించాడు.

ఇతను ఎక్కువగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ద్వారా ప్రజలలో గుర్తింపును పొందాడు. అయితే ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావడం వలన ఆయన చదువుకునే రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. కొన్ని కారణాల వలన చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవయాడు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వారణాసి లోని తన  మామయ్య ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పుడు శాస్త్రి ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇతనికి ఎంతో ఆత్మాభిమానం ఉండేది. ఎవ్వరినీ ఏదీ ఊరికే అడిగేవాడు కాదు. అయితే తాను వెళ్ళవలసిన స్కూల్ గంగానది అవతల ఉండేది. ప్రతి రోజూ స్కూల్ కు వెళ్లే సమయంలో గంగానదిని దాటి పడవలో ప్రయాణించి వెళ్ళక తప్పదు. అయితే పడవ నడిపే వ్యక్తికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి. కానీ ఇతని దగ్గర ధనం ఏమీ లేకపోవడంతో ఏమి చెయ్యాలో అర్థం కాలేదు.

ఒకవేళ శాస్త్రి పడవ నడిపే వ్యక్తిని అడిగినా ఊరికే తీసుకు వెళ్ళేవాడు. అయితే అలా అడగడానికి తన మనసు అంగీకరించలేదు. తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అడగలేకపోయాడు. అప్పుడు శాస్త్రి చేసిన పని అందరికీ నమ్మబుద్ధి కాదు. అయితే జరిగింది నిజం... తమ షర్ట్ విప్పి అందులో బుక్స్ అన్నీ మూట కట్టి తన వీపుకు కట్టుకుని గంగానదిలో ఈదుకుంటూ స్కూల్ కు వెళ్లే వాడు. అంత చిన్నవయసులోనే తన ప్రాణాలకు తెగించి చూపాడు. తన పోరాట పటిమను దైర్యాన్ని తన జీవితాంతం కొనసాగిస్తూ వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: