మందుబాబులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం?
అంతేకాదు జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఉండ కుండా సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక మద్యం దుకాణాల పని వేళల్లో కూడా ఎన్నో రకాల మార్పులు చేసింది ప్రభుత్వం. క్రమ క్రమంగా రాష్ట్రం లోని మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తూ ఇక పూర్తిగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది జగన్ ప్రభుత్వం. అయితే జగన్ ప్రభుత్వం వరుసగా తీసుకున్న నిర్ణయాల తో ఇటు మందు బాబులకు మాత్రం షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయ్ అని చెప్పాలి. ఇక ప్రతి ఏడాది మద్యం దుకాణాల సంఖ్య ను తగ్గిస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం.
కానీ ఇటీవలే మద్యం దుకాణాల విషయంలో మందుబాబులు అందరికీ మంచి కెకిక్కు ఎక్కే న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించకుండా మరో ఏడాది వరకు కొనసాగించ పోతున్నట్లు తెలిపింది. వాక్-ఇన్ స్టోర్స్ కొనసాగించడంతో పాటు కొత్తగా పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్లెట్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. లాభనష్టాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలను ఎక్కడికైనా తరలించేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి నూతన విధానాన్ని అమలులోకి తీసుకు రాగా.. ఇది వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది.