బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌.. దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డిందిగా...!

VUYYURU SUBHASH
ప‌శ్చిమ‌బెంగాల్ లో జ‌రిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు నెమ్మ‌దిగా వెల్ల‌డ‌వుతున్నాయి. వీటిల్లో భ‌వానీపూర్ నుంచి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయిన మ‌మ‌తాబెన‌ర్జీ  ఈ బై పోల్ లో గెలిచి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందు కోసం భ‌వానీపూర్ కు ఉప ఎన్నిక‌ను తెచ్చారు. ముఖ్య‌మంత్రే ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో కోవిడ్ ప‌రిస్థితుల్లో కూడా ఈ సీటుకు సీఈసీ ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించాల్సి వ‌చ్చింది.

భారీ ఎత్తున ప్ర‌చారం లేక‌పోయినా, ఆర్భాటం లేక‌పోయినా పోటాపోటీ  ప‌రిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నిక‌లో మ‌మ‌త‌ను ఓడించి.. ఆమెకు చెక్ పెట్ట‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌క‌టించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మమ‌త‌ను ఓడించిన‌ట్టే, ఈ బై పోల్ లోనూ ఓడించి స‌త్తా చూపుతామంటూ గ‌త ఎన్నిక‌ల్లో ఆమె మీద గెలిచిన సువేందు అధికారి ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి పీఠంపై ఉన్న మ‌మ‌త‌ను మ‌రోసారి ఎమ్మెల్యేగా ఓడించి.. ఆమెకు ప్ర‌శాంత‌త లేకుండా చేస్తామ‌న్న‌ట్టుగా క‌మ‌లం పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ,  వాళ్ల టార్గెట్ గ‌ట్టిగానే ఉన్నా ఆచ‌ర‌ణ‌లో మాత్రం అంత తేలిక‌గా క‌నిపించ‌డంలేదు.

భ‌వానీపూర్ నియోజ‌క‌వ‌ర్గం టీఎంసీకి కంచుకోట‌. గ‌తంలో మ‌మ‌త ఇదే సీటు నుంచి రెండు సార్లు గెలిచారు. అలాంటి చోట ఆమెను ఓడించ‌డం దాదాపు అసంభ‌వమ‌ని చెప్ప‌వ‌చ్చు. ఫ‌లితాల స‌ర‌ళి కూడా ఈ విష‌యాన్నే చెబుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే స‌రికే మ‌మ‌త మెజారిటీతో దూసుకుపోతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. మొద‌టి రౌండ్ కౌంటింగ్ పూర్త‌య్యే స‌మ‌యానికి మ‌మ‌తా బెన‌ర్జీ 2500 ఓట్ల‌కు పైగా మెజారిటీని సాధించి ఆధిక్యంలో నిలిచారు. బీజేపీ అభ్య‌ర్థి తొలి రౌండ్ లో కేవ‌లం 800 ఓట్లు సాధించ‌గ‌లిగారు.

భ‌వానీ పూర్ లో టీఎంసీకి ఉన్న ఊపు, తొలి రౌండ్ల కౌంటింగ్ స‌ర‌ళిని గ‌మ‌నిస్తే.. మమ‌తాబెన‌ర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావ‌డం లాంఛ‌న‌ప్రాయ‌మేన‌నిపిస్తోంది. మ‌రోసారి మమ‌త‌ను ఓడించి ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చుకోవ‌డానికే ఆమె మొహ‌మాటప‌డే ప‌రిస్థితి తీసుకురావాల‌నుకుంటున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ ల‌క్ష్యం నెర‌వేరుతున్న‌ట్టుగా క‌నిపించ‌డంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: