భవానీ పూర్ ఫలితమే హుజూరాబాద్ లో రాబోతుంది ?

Veldandi Saikiran
భారతీయ జనతా పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు  తెలంగాణ ఆర్థిక మంత్రి  తన్నీరు హరీష్ రావు. ఈ రోజు బెంగాల్ ల్లో మమత బెనర్జీ  గెలిచిందని.. రేపు మత తత్వ బీజేపీ పార్టీ కి హుజురాబాద్ లో స్థానం లేదని చెప్పాలని ప్రజలకు పిలునిచ్చారు మంత్రి  తన్నీరు హరీష్ రావు. లెఫ్ట్ అన్న ఈటల రాజేందర్ రైటీస్ట్ గా ఎలా బీజేపీ పార్టీ లో చేరారని నిప్పులు చెరిగారు  తన్నీరు హరీష్ రావు. నల్లా చట్టాలు అని చెప్పిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు హరీష్ రావు. 

స్వార్థం కోసం బీజేపీ పార్టీ లో ఈటల రాజేందర్ చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి  తన్నీరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం  పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తుందని మండి పడ్డారు మంత్రి  తన్నీరు హరీష్ రావు.  కరోనా మహమ్మారి వ్యాక్సిన్ ఈస్తల్లేరు అన్న ఈటెల రాజేందర్ కు ఇప్పుడు బీజేపీ పార్టీ  ఎలా దగ్గర అయిందని ఫైర్ అయ్యారు మంత్రి  తన్నీరు హరీష్ రావు. బీజేపీ పార్టీ  వల్ల దళితులు, బీసీ లు ఏం లభ్ది పొందారని ప్రశ్నించారు.

 
బీసీ మంత్రిత్వశాఖ పెట్టాలని కోరిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని.. రోజుకో కేంద్రమంత్రి వస్తున్నారు...  మరి వాళ్ళు తెలంగాణ కు ఏం ఇస్తామని చెప్పారని మండిపడ్డారు మంత్రి  తన్నీరు హరీష్ రావు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది, మంత్రులు తగ్గిస్తారా, చెప్పాలని నిలదీశారు మంత్రి  తన్నీరు హరీష్ రావు. ఇక అంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ పై ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తనకు   ఊహ తెలిసి నాటి నుండి ఇంత చేదు చూడలేదని.. ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.  ఓ మంత్రి ముహూర్తం పెట్టినట్లుగా తనకు తానే దాడి చేయించుకుంటడు అని నీచంగా మాట్లాడుతన్నారని..  తన జీవితం మొత్తం పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ని తానని పేర్కొన్నారు ఈటల రాజేందర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: