ఆ మంత్రి ప్లేస్‌... ఆయ‌న స‌తీమ‌ణికేనా... వైసీపీలో హాట్ టాపిక్ ?

VUYYURU SUBHASH
ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌కీయంగా ప‌రిణితి ఉన్న నేత‌. అంతేకాదు.. ఉత్త‌రాంధ్ర‌పై గ‌ట్టి ప‌ట్టు కూడా ఉంది. ఒక‌ప్పుడు రాష్ట్ర స్థాయిలో రాజ‌కీయాలు చేశారు. అయితే.. ఇప్పుడు ఏకంగా. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో త‌న ప్లేస్‌ను త‌న స‌తీమ‌ణికి ఇవ్వాల‌నేది ఆయ‌న ప్ర‌తిపాద‌న. దీనిపై ప్ర‌స్తుతం అధికార పార్టీలో చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. చాలా సీనియ‌ర్ అయిన‌ప్పటికీ.. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌న‌గ‌రంలో ఆయ‌న ప‌ట్టు స‌డులుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ్రూపు రాజ‌కీయాలు కూడా పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొనేందుకు రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న బొత్స‌.. గ‌తంలో కాంగ్రెస్ రాష్ట్ర సార‌థిగా కూడా ప‌నిచేశారు. ఇక‌, ఆయ‌న స‌తీమ‌ణి.. ఝాన్సీ కూడా గ‌తంలో ఒక‌సారి ఎంపీ అయ్యారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ త‌ర‌ఫున టికెట్ ఆశించినా.. ద‌క్క‌లేదు. ఇప్పుడు.. తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఇక‌పై ఉండ‌బోన‌ని.. త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని.. బొత్స‌.. జ‌గ‌న్‌ను అభ్య‌ర్థిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న స‌తీమ‌ణికి.. ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప్లేస్‌లో ఆమెను నిల‌బెట్టి గెలిపించుకోవ‌డం ద్వారా.. మంత్రి వ‌ర్గంలోనూ చోటు కోసం.. చూస్తున్నారు. ఇంత‌వ‌ర‌కుబాగానే ఉన్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆలోచ‌న మ‌రోవిధంగా ఉంద‌ని అంటున్నారు.

బొత్స కుటుంబానికి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో స్థానం క‌ల్పిస్తూనే.. ఆయ‌న సతీమ‌ణికి కాకుండా.. కుమారుడికి అవ‌కాశం ఇచ్చేందుకు సిద్ధ‌మేన‌ని అంటున్నారు. దీనికి బొత్స త‌ట‌ప‌టాయిస్తున్నారు. త‌న సతీమ‌ణిని ముందుకు తీసుకువ‌చ్చి.. త‌ర్వాత‌.. త‌న కుమారుడికి కూడా అవ‌కాశం ఇప్పించుకోవాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నంగా ఉంది. ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం బొత్స కుటుంబం నుంచి చాలా మంది నాయ‌కులు చ‌క్రం తిప్పుతున్నారు. ఇప్ప‌టికిప్పుడు త‌న కుమారుడిని అరంగేట్రం చేయిస్తే.. త‌న స‌తీమ‌ణికి ప్రాధాన్యం పోవ‌డంతోపాటు..త‌న వ్యూహంగా ఉన్న రెండు టికెట్లు దక్కే అవ‌కాశం లేద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపి.. త‌న స‌తీమ‌ణికే టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: