బాబు జాగ్రత్త.. పవన్ వైపు తిరిగితే కష్టమే....
కానీ ఆనందం 2019 ఎన్నికల తర్వాత లేదు....జగన్ దెబ్బకు పార్టీ చిత్తుగా ఓడింది. అక్కడ నుంచి పార్టీ పుంజుకోలేకపోతుంది. అసలు జగన్‌కు కొంచెం కూడా పోటీ ఇవ్వలేకపోతుంది. పైగా బాబు కూడా చినబాబుని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో జనాల్లోకి రావడం కూడా తగ్గించేశారు. దీంతో పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. సరే మన వల్ల ఎలాగో కావడం లేదని చెప్పి బాబు....పవన్‌ని పట్టుకుని రాజకీయం చేయాలని కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్‌కు కూడా సింగిల్‌గా ఎలాగో బలం లేదు. కనీసం టిడిపితో జట్టు కడితే నాలుగు సీట్లు దక్కించుకోవచ్చనే ప్లాన్‌లో ఉన్నట్లున్నారు. అటు చంద్రబాబు కూడా పవన్ ఉంటేనే జగన్‌కు చెక్ పెట్టగలమని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇలా పవన్‌ని ముందు పెట్టి బాబు రాజకీయ క్రీడ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. దీని వల్ల జగన్‌కు ఎంత నష్టం జరుగుతుందో తెలియదు గానీ, భవిష్యత్‌లో టిడిపికైతే భారీగానే నష్టం జరిగేలా ఉంది. ఇప్పుడు పవన్ దూకుడుగా ఉంటున్నారు. బాబు ఏమో సైలెంట్ గా రాజకీయం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జనాలకు బాబు కంటే పవనే బెటర్ అని అనుకుంటే టిడిపి కొంపమునగడం ఖాయం. టిడిపికి ప్రత్యామ్నాయం జనసేన అని భావిస్తే పరిస్తితులు మారిపోతాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లో టిడిపిని సైడ్ చేసి జనాలు జనసేనని ఆదరించిన ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు వైసీపీ-జనసేనలు మధ్య ఫైట్ జరిగితే టిడిపి ప్రేక్షకపాత్ర వహించాలి. కాబట్టి ఇప్పటినుంచే బాబు జాగ్రత్తగా రాజకీయం చేయాల్సిన అవసరముంది.