అయ్యో.. ఎంత అప్డేట్ అయ్యారు.. బాత్రూంలో కూడా అదే పని?
మనిషి ఎప్పుడు ఫోన్ ఉపయోగించాలి.. ఎప్పుడు ఏం చేయాలి అన్న విషయాలను కూడా ఈ వాట్సాప్ డిసైడ్ చేస్తుంది అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో మనిషి జీవితం మొత్తం వాట్సాప్ తో కమ్ముకు పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా రోజు రోజుకి వాట్సాప్ వాడటం ఒక రేంజ్ లో పెరిగి పోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. అయితే నేటి రోజుల్లో మనుషులు వాట్సాప్ కి ఎంత బానిసలుగా మారిపోయారు అంటే అరక్షణం పాటు అరచేతిలో మొబైల్ లేకపోతే.. మొబైల్ లో వాట్సాప్ లేకపోతే పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు.
ముఖ్యంగా నేటి రోజుల్లో బాత్ రూమ్ కి వెళ్ళిన కూడా వాట్సాప్ వాడటం ఆపడం లేదు ఎంతో మంది జనాలు. ఎంతోమంది నేటి రోజుల్లో మొబైల్ చేతిలో పట్టుకుని బాత్రూమ్ లోకి దూరడం.. ఇక అక్కడ వాట్సాప్ వినియోగిస్తూ.. బాత్రూంలో కూడా ఏదో విహారం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ గంటల తరబడి గడుపుతూ ఉండటం గమనార్హం. ఇలా చాలా మటుకు నేటి రోజుల్లో జనాలు.. వాట్సాప్ కి బానిసలుగా మారిపోయి.. ఎక్కడపడితే అక్కడ ఈ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ను ఉపయోగిస్తూ ఉండటం గమనార్హం.