ఆ ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలకు రేవంతు షాక్ ఇచ్చారా..?

MOHAN BABU
హుజురాబాద్ సమరంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. టిఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెలిచిన శ్రీనివాస్ యాదవ్  ను చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఆయన ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు. బిజెపి నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్లు కూడా అధికారికంగా  ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది. కొంతకాలంగా టిఆర్ఎస్ పై తీవ్రంగా కొట్లాడుతున్న రేవంత్ రెడ్డి తన పీసీసీ చీఫ్ అయ్యాక ఎదురవుతున్న మొదటి పరీక్ష హుజురాబాద్ ఉప ఎన్నిక. ఇక్కడ సత్తా చాటాలని ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేవంత్ వ్యవహారం చూస్తుంటే హుజురాబాద్ ని పట్టించుకోనట్లే కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి హుజురాబాద్  లో ఎలాగైనా టిఆర్ఎస్ ని ఓడించాలనే లక్ష్యాన్ని మాత్రమే పెట్టుకున్నారని చెబుతున్నారు.


అక్కడ టిఆర్ఎస్ బలాబలాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ వ్యూహాన్ని రచిస్తున్నట్లు గా తెలుస్తోంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ కి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి 60 వేలకు పైగా ఓట్లు  సాధించారు. అందుకోసం 20 రోజులపాటు ప్రచారాన్ని హోరెత్తించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్ తో పాటు 20 మందిని టిపిసిసి స్టార్ క్యాంపెనర్లుగా గుర్తించింది. వీరంతా హుజురాబాద్  ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇందులో సీనియర్ నాయకులు  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నూతన ఎమ్మెల్యే గుగ్గిళ్ళ శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్ అదేవిధంగా హుజురాబాద్ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాలతో పాటు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, మాజీ కేంద్ర మంత్రులు  రేణుకా చౌదరి, బలరాం నాయక్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల  జిల్లాలకు చెందిన డిసిసి అధ్యక్షులు, కరీంనగర్ నగర అధ్యక్షులు, ముఖ్య నేతలని  టిపిసిసి ప్రచార బాధ్యతలను అప్పగించింది.


అయితే మాజీ పిసిసి సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కి ఈ ఛాన్స్ దక్కలేదు. ఇటీవలే హుజురాబాద్ వ్యవహారం పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కమిటీ వేస్తే పనిచేసుకుంటారు కదా అని రేవంత్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ప్రచార బృందంలో కోమటిరెడ్డి కి ఛాన్స్  వస్తుందని భావించారు. అయితే ఉత్తమ్,కోమటి రెడ్డి లేకుండానే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ బయటికి రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: