ఇక పవన్ ఒక్కడే బయటకు రావాలి..
ఇక సినీ పెద్దల్లో ఎవరూ ఎటూ మాట్లాడలేదు. మాట్లాడరు కూడా.. చిరంజీవి నేరుగా స్టేట్ మెంట్ అయితే ఇవ్వలేదు కానీ అన్నయ్య తరపున తమ్ముడు నాగబాబు బయటకొచ్చారు. చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ కే మద్దతిచ్చారని, తనను కూడా ఆయనకే సపోర్ట్ చేయాలని చెప్పారంటూ.. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కేనంటూ కుండబద్దలు కొట్టారు. ఇండస్ట్రీ పెద్దల్లో కృష్ణ, కృష్ణంరాజు, నందమూరి బాలకృష్ణ తదితరులను ఇప్పటికే మంచు విష్ణు కలిసి.. ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. తన ప్యానల్ కు మద్దతివ్వాలని కోరారు. ఇక బయటకు రావాల్సింది పవన్ కళ్యాణ్ ఒక్కరే. మరి ఆయన కూడా వచ్చేస్తారా.. మనసులో మాట చెప్పేస్తారా..?
పవన్ కళ్యాణ్ మా ఎన్నికలపై ఇప్పటివరకూ నోరు విప్పలేదు. మూడేళ్ళ క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో పవన్ ఫిలిం ఛాంబర్ ఆఫీసుకు వెళ్ళాడు.. తన తల్లిని కావాలని తిట్టించారంటూ ఆందోళనకు దిగారు. అప్పట్లో ఈ విషయం సంచలనం అయింది. తన తల్లిని తిట్టించినవారిపై మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలంటూ పవన్ డిమాండ్ చేశాడు. అయితే కొద్దిరోజులకు ఈ విషయం అందరూ మర్చిపోయారు. పవన్ కు మాత్రం న్యాయం జరిగినట్టులేదు. దీంతో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో సమస్యలపై స్పందించాడే తప్ప.. మా ఎన్నికలపై ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా.. లేదో చూడాలి. ఇటీవల రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో పవన్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. అయితే ఇప్పుడు ఆల్రడీ సంచలనంగా మారిన మా ఎన్నికలపై పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతానికి పవన్ మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కే అని అర్థమవుతోంది. ఎందుకంటే పవన్ భక్తుడు బండ్ల గణేష్ కూడా పోటీనుంచి తప్పుకుని ప్రకాష్ రాజ్ తో టై అప్ అయ్యారు కాబట్టి. మరి నేరుగా పవన్ కూడా ఓ మాట చెప్పేస్తారేమో చూడాలి.