ఆ వైసీపీ ఎమ్మెల్యేను ఫిక్స్ చేస్తున్నారా... అదే జరిగితే చెక్ ఖాయం?
అయితే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారంపూడి....ఎక్కువసార్లు వివాదాల్లోనే ఉన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లని పచ్చి బూతులు తిట్టిన విషయం తెలిసిందే. అదే అంశంపై ఇటీవల పవన్ కూడా కామెంట్ చేశారు. తాను అన్నీ గుర్తు పెట్టుకున్నాని మాట్లాడారు. ఇక కాకినాడ అడ్రెస్‌తో వస్తున్న హెరాయిన్ కంటైనర్ గుజరాత్‌లో పట్టుబడిన విషయం తెలిసిందే. అలాగే కాకినాడ ఓడరేవులో అనూహ్యంగా ఓ బోటు తగలబడింది. అందులో డ్రగ్స్ ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ద్వారంపూడి ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుందని ఆరోపణలు గుప్పించారు. అలాగే మీడియాకి సంబంధించి కూడా ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అలాగే జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో తూర్పు గోదావరి వైసీపీలో ఈయనదే పెత్తనం అని టాక్. అందుకే సొంత పార్టీ నేతలు సైతం ఈయన వైఖరి పట్ల అసంతృప్తిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా టిడిపి చేతులో ఉన్న కాకినాడ మేయర్ పీఠాన్ని వైసీపీ వశమయ్యేలా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలు....ద్వారంపూడికి ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే సింగిల్‌గా ద్వారంపూడికి చెక్ పెట్టడం కష్టం. అదే టిడిపి-జనసేనలు కలిస్తే ద్వారంపూడికి ఇబ్బందే. అది 2014 ఎన్నికల్లో రుజువైంది.
టిడిపికి జనసేన సపోర్ట్ ఇవ్వడంతో...ద్వారంపూడి ఓటమి పాలయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ద్వారంపూడికి బెనిఫిట్ అయింది. కాకినాడ సిటిలో ద్వారంపూడికి టిడిపి మీద 14 వేల మెజారిటీ వచ్చింది....అదే జనసేనకు ఇక్కడ 30 వేల ఓట్లు వచ్చాయి. అంటే ఒకవేళ టిడిపి-జనసేనలు కలిస్తే ఏమవుతుందో చెప్పొచ్చు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేనలు కలిస్తే ద్వారంపూడికి చెక్ పడిపోతుంది.