జగన్ పరిపాలన : పన్ను చెల్లింపు దారుల్లో అనిశ్చితి
జగన్ పరిపాలన : పన్ను చెల్లింపు దారుల్లో అనిశ్చితి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు లబ్దిదాలకు సంతోషాన్ని కలిగిస్తున్నయా ? లేదా ? అన్న విషయం పై అధికార పార్టీలోనే క్లారిటీ లేదు. ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు పన్నులేనన్నది సుస్పష్టం. అది ఏరూపేణా అయినా కావచ్చు. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు , వాటి ద్వారా రాష్ట్ర ఖజానా చేకూరుతన్న రాబడి, దాని ఆధారంగా చేస్తున్న వ్యయాన్ని బట్టి రాష్ట్ర స్థితిని అంచనా వేస్తారు విశ్లేషకులు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి పలు మార్గాలను అచరణలో పెడుతోంది. అంతే కాదు మరిన్ని అలోచనలు చేస్తోంది. ఖజానాకు నిధులు ఎలా సమకూర్చాలి ? అనే విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి చాలా మంది సలహాదారులున్నారు. వారు ఏసి గదుల్లో కూర్చోని మేధో మథనం చేస్తారు. సి.ఎం, కు సలహాలు ఇస్తారు. కాని భారం పడేది మాత్రం సామాన్యులకే. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి ఉద్యోగులకే. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాక విద్యుత్ చార్జీలు పెంచారు. గతంలో ఉండే విధానాన్ని మార్చి కొత్త విధానాన్ని అములు చేశారు. దీంతో సామాన్యుడిపై విపరీతమైన భారం పడింది. చాలా చోట్ల పాత విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్తవి అమర్చారు. ధరలకు స్లాబ్ రేటు వర్తింపజేశారు. దీంతో ఇంత విద్యత్ బిల్లు ఏ ప్రాతిపదికన వస్తుందనేది ఎవరికి తెలియకుండా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంటి పన్నులను ఎడా పెడా పెంచింది. దీంతో ఖజానాకు భారీగా లబ్ది చేకూరింది. అదే సమయంలో ఇల్లు ఎందుకు కట్టుకున్నాం రా బాబోయ్ అంటూ గృహ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. భూ క్రయ విక్రయాల పన్ను కూడా ఆంధ్ర ప్రదేశ్ లో పెరిగింది. ఇది సమాన్య రైతుల భారంగా మారింది. చాలా గ్రామాల్లో భూ క్రయ విక్రయాలు రిజిస్టర్ అవడం లేదు. రిజిస్ట్రేషన్ చార్జీలు భరించ లేక కర్షకులు కేవలం కాగితాల్లోనే క్రయ విక్రయాలు పూర్తి చేసుకుంటున్నారు.
ఇవి మచ్చుకు మాత్రమే.. పన్ను చెల్లింపు దారులు ప్రభుత్వ తీరును తూర్పార పడుతున్నారు. తాము చెల్లించిన మొత్తం నగదుతో ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని, తమకు చేసిందేమీ లేదని వారు బాహాటంగానే ప్రభుత్వం పనితీరును విమర్శిస్తున్నారు. ఇంత చెల్లించినా రాష్ట్ర ఖజానా ఎప్పటికప్పుడు ఖాళీ అవుతుండటంతో పన్ను చెల్లింపు దారుల్లో అసంతృప్తిని రగిలిస్తోంది.