బద్వేల్ వైసీపీ క్యాండెట్ సుధ బ్యాక్ గ్రౌండ్ ఇదే...!
ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ల్లో అధికార వైసీ పీ గెలుపు దాదా పు ఏకపక్షం అని తేలి పోయింది. ఇక్కడ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తమ అభ్యర్థిని పోటీ పెట్టడం లేదు. ఇక జనసేన కూడా తాము ఇక్కడ పోటీ పెట్టమని చెప్పేసింది. ఇక ఇక్కడ జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ పోటీ పెడుతున్నా కూడా ఆ పార్టీలకు ఇక్కడ నామ మాత్రపు ఓటు బ్యాంకు కూడా లేదు.
దీంతో ఇక్కడ వైసీపీ గెలపు విషయంలో ఎవ్వరికి సందేహా లు లేవు. అయితే ఆ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఎంతన్న దాని మీదే ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న డాక్టర్ సుధ దివంగత వెంకట సుబ్బయ్య సతీమణి. ఆమె కోసం వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక సుధధ గత మూడు నెలల నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు.
ఆమె కడప జిల్లాలో ఫేమస్ గైనకాలజిస్ట్. డాక్టర్ చదవి మరో డాక్టర్ వెంకటసుబ్బయ్యను వివాహమాడారు. ఇద్దరూ కలసి కడప లో ప్రయివేటు ప్రాక్టీస్ ను నిర్వహిస్తున్న క్రమంలోనే పరిచయం ఏర్పడి .. తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక దాసరి సుధ కు జిల్లా నలుమూలల నుంచి వైద్యం కోసం వచ్చే వారి ద్వారా విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఆమె గత రెండేళ్లు గా భర్త తో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తుండడం కూడా ప్లస్ కానుంది.
గత ఎన్నికల్లోనే ఇక్కడ వెంకటసుబ్బయ్యకు 44 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీని అధిగమించాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. వైసీపీ గెలుపు విషయంలో ఆ పార్టీ వాళ్ల కు కూడా సందేహాలు లేవు. మొన్న టీడీపీ పోటీ లో ఉంటే 60 వేలు మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇక ఇప్పుడు టీడీపీ పోటీ లో లేకపోవడంతో లక్ష మెజార్టీ రావాలని జగన్ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది.