ఏపీ ప్రజలకు వార్నింగ్: పొంచి ఉన్న కరెంట్ కొరత...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎనర్జీ సెక్రెటరి నాగులపల్లి శ్రీకాంత్  నేడు మీడియాతో మాట్లాడుతూ... కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది అని అన్నారు. 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో చాలా వాటిలో 4 రోజులు మించి బొగ్గు నిల్వలు లేవు అని ఆయన పేర్కొన్నారు. ఏపీ జెన్కో కు రావాల్సిన రేక్స్ క్రమంగా పెరుగుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీపిపి, వీటీపీఎస్ లో రెండురోజుల నిల్వలు మాత్రమే ఉన్నాయి అని అన్నారు ఆయన. అంతర్జాతీయ గా బొగ్గు రేట్లు రెండు మూడు రెట్లు పెరిగాయి అని తెలిపారు.

దేశీయ బొగ్గు గనుల పైనే అంతా ఆధారపడటంతో ఒత్తిడి నెలకొంది అని ఆయన వివరించారు. కేంద్రానికి కూడా దీనిపై లేఖ రాస్తున్నాం అని అన్నారు. ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంది అని అన్నారు. కోవిడ్ కారణంగా 20 శాతం మేర విద్యుత్ వినియోగం పెరిగింది అని వివరించారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది అని అన్నారు. ఏపీ జెన్కో నుంచి 40 మిలియన్ యూనిట్లు, కేంద్ర ప్లాంట్ల నుంచి 30 మిలియన్, జల విద్యుత్ కేంద్రాల నుంచి 20 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతోంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

 సౌర, పవన విద్యుత్ సరఫరా కారణంగా రెండేళ్లుగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల తో ఒప్పందం చేసుకోలేదు అని అన్నారు. ప్రస్తుతం అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల లోను వంద శాతం ఉత్పత్తి జరగడం లేదు అని ఆయన తెలిపారు. బొగ్గు సరఫరా లేక పోవడం వల్లే బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నామని అన్నారు. గత నెలబ్16 తేదీన లో యూనిట్ కు 4.60 పైసలు ఉంటే ఇప్పుడు ఆగస్టు 7 తేదీన 14  రూపాయలకు చేరింది అని వివరించారు. పీక్ డిమాండ్ ఉన్న సమయంలో అధిక రేటు పెట్టి కొనాల్సి ఉంటుంది అని అన్నారు. ఒక్కోసారి విద్యుత్ కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది అని అన్నారు. బొగ్గు ఉంటే  జెన్కో ప్లాంట్ ల నుంచి మరో 40 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసుకోవచ్చు అని గృహ వినియోగదారులు పీక్ డిమాండ్ సమయంలో ఏసీ లోడ్ తగ్గిస్తే 10 మిలియన్ యూనిట్ లు కొనుగోలు చేసే అవసరం ఉండదు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: