ఈటల రాజేందర్ కు మరో కొత్త సవాల్ !

Veldandi Saikiran
ఈటల రాజేందర్‌ పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు హరీష్ రావు.  టీఆరెస్ కు ఎందుకు ఓటు వేయాలో వంద కారణాలు చెబుతానని..బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఈటల రాజేందర్‌ చెప్పాలన్నారు హరీష్‌ రావు.   ఆసరా  పెన్షన్ , కళ్యాణ లక్ష్మి పథక తీసుకున్న వారిని అడుగు కేసీఆర్‌ మానవత్వం ఉన్నదా లేదా చెబుతారని.. కరోనా కాలంలో ఉద్యోగుల జీతాలు మంత్రుల జీతాలను తగ్గించి రైతుల కోసం 7500 కోట్ల రూపాయలను రైతు బంధు కేసీఆర్ అందించాడని గుర్తు చేశారు హరీష్‌.  


వ్యవసాయ బావుల కాడా మోటర్లకు మీటర్లు పెట్టమని చెబుతున్న బీజేపీకి ఓటు వేయాలా... ? నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మోటర్లకు మీటర్లు పెట్టనివ్వనని  అంటున్నాడు కేసీఆర్ అని తెలిపారు.  నాలుగేళ్ళ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత కేసీఆర్ దేనని.. డీజిల్ గ్యాస్ ధర పెంచిన బీజేపీ వైపు ఉంటారా ? అని ప్రశ్నించారు హరీష్‌ రావు.   కళ్యాణ లక్ష్మీ ఆసరా పెన్షన్ ఇచ్చిన టీఆరెస్ వైపు ఉంటారా ఆలోచించండని.. రైతు బంధు వద్దన్న ఈటల సంవత్సరానికి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడని తెలిపారు హరీష్‌ రావు.  


నల్ల చట్టాలను రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్న రైతులను లాఠీలతో కొట్టమని  బీజేపీ నాయకులు అంటున్నారని... నీకు నీతి నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే పెంచిన గ్యాస్ ధర ను తగ్గిస్తామని  చెప్పి ఓట్లు అడగాలని ఈటలకు సవాల్‌ విసిరారు హరీష్‌ రావు.  పెద్ద నోట్ల రద్దు చేసి మీ ఖాతాలలో 10 లక్షల రూపాయలను వేస్తామ ని చెప్పి ఒక్క రి ఖాతాలో నైనా వేశారా ? సిరి సేడు గ్రామాన్ని దత్త త తీసుకున్న ఈట ల ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదని ఫైర్‌ అయ్యారు హరీష్‌ రావు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: