ఆఫ్ఘనిస్తాన్లో దారుణం.. నిజం బయటపడింది?
ఆఫ్ఘనిస్తాన్ లోని కోర్టులలో కూడా తాలిబన్ల లోని ముఖ్య నేతలే న్యాయమూర్తులుగా మారిపోవడంతో ఇక షేరియా చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అంతే కాదు అటు మహిళలపై కూడా తాలిబన్లు విధిస్తున్న ఆంక్షలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇక ప్రజల పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా మారిపోతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై అటు అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తోంది అని చెప్పాలి. తాలిబన్లు ఎంత అరాచకానికి పాల్పడుతున్నారు అనే విషయాన్ని తెలియజేసేలా ఇటీవలే మరో నిజం బయటపడింది.
డ్రగ్స్ కి బానిస గా మారి పోయి నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల అటు తాలిబన్లు ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తమదైన శైలిలో శిక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. డ్రగ్స్ కి బానిస గా మారిపోయిన వారితో నగ్నంగా స్నానం చేయించి గుండు కొట్టిస్తారు. అంతే కాదు ఇలాంటి డ్రగ్స్ బానిసలకు కనీసం భోజనం కూడా పెట్టడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే డ్రగ్స్ బానిసగా మారిన వారికి ఇది ఒక రకమైన చికిత్స అంటూ అక్కడి వైద్యులు సమాధానం ఇస్తున్నారట. అక్కడ చాలా మంది పేదలు హెరాయిన్ డ్రగ్స్ వాడుతూ ఉండగా వారందరినీ కాబూల్లోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మాట వినకుండా ఎదురు తిరిగితే చంపేసినట్లు తెలుస్తోంది.