కొండా ఫ్యామిలీకి రామ్ గోపాల్ వర్మ షాక్ ఇస్తాడా?
అయితే ఎప్పుడు ఎదో ఒక వివాదం ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొండ దంపతుల పై సినిమా తీస్తా అని ప్రకటించాడు. అయితే ఈ సినమా లో కొండ కుటుంబాన్ని వర్మ ఎ విధంగా చూపిస్తాడు అనే ప్రశ్న కొండ దంపతుల అభిమానుల తో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొంది. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ కనిపించేంతా మంచి వాడు కాదు. ఎప్పుడు ఎవరి కి వెన్ను పోటు పొడుస్తాడో.. ఎవరిని హీరో అని పొగుడుతాడో తెలియదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొండ దంపతుల పై సినిమా తీస్తా అనడం పలువురి కాస్త ఆందళోన కరంగానే ఉంది. అయితే వర్మ ఎ పని చేసినా అందులో కొంచం అయినా కాంట్రవర్సి ఉండాలని కోరుకుంటాడు. అందులో భాగంగా ఈ సినిమా లో కూడా కాంట్రవర్సీ పెడితే ఎవరి పై పెడుతాడో అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రత్యర్థుల పరంగా కాంట్రవర్సీ పెడితే కొండ దంపతులు సేఫ్. కానీ కొండ దంపతుల పై నే కాంట్రవర్సీ వచ్చేలా సినిమా తీస్తే మాత్రం కొండా ఫ్యామిలి షాక్ గురి కాక తప్పదు. రామ్ గోపాల్ వర్మ కొండా ఫ్యామిలీ బయోపిక్ ద్వారా ఎలాంటి పెంట పెడుతాడో చాడాలి మరి.