అమ్మఒడి కావాలా... అయితే రూల్ పాటించాల్సిందే..!
అయితే ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో... ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ క్లాసులను పూర్తిగా రద్దు చేసి... కేవలం ప్రత్యక్ష విధానంలోనే పాఠాలు భోదిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. పిల్లలంతా బడి బాట పట్టడంతో.... వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకం కోసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది నుంచి హాజరు నిబంధన తప్పనిసరిగా ఉండాలని ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా తొలగించిన హాజరు నిబంధనను... మళ్లీ అమలు చేయాలని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు పూర్తిస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో హాజరు నిబంధన తప్పనిసరి చేయాలని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అకడమిక్ ఇయర్‌తో అమ్మఒడి పథకాన్ని అనుసంధానం చేయాలని కూడా అధికారులకు దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్.