తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక... ఉన్న సంగతి మనందరికీ విధితమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నోటివెంట హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల మాటే వస్తోంది. ఎక్కడైనా నలుగురు కూర్చుని మాట్లాడినా ఈ ఉప ఎన్నిక పై... చర్చిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లడం ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతేకాదు హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు... మునుపెన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికలు జరగడం గమనార్హం.
ఇదిలా ఉండగా... హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో.. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని.. ఈ గెలుపు ను ఎవరు ఆప బోరని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. అసలు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత.
ఈటల రాజేందర్ ఓటమి ఖాయం గా కనిపిస్తుందని... గెల్లు శ్రీనివాస్ హుజూరాబాద్ నియోజకవర్గం లో టి ఆర్ ఎస్ జెండాను ఎగరవేయడం పక్క అని తేల్చేశారు కవిత. అంతేకాదు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారని... అలా బయటికి వెళ్లిన వారు ఏ ఒక్కరు బాగు పడలేదని ఆమె చెప్పారు. వాళ్ళందరికీ పట్టిన గతే ఈటల రాజేందర్ కు కూడా పడుతుందని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత. ఈటల రాజేందర్ ఎన్ని పన్నాగాలు పన్నినా... వచ్చే ఉప ఎన్నికల్లో తేలిపోతాయి అన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ ఆయుధమని... ఆయన లాంటి నాయకులు దేశంలో ఎక్కడా లేదని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి అధికార టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు కవిత.