రాజీనామాల సునామీ: నీ తొక్కలో ఉద్యోగం.. నాకొద్దు పో..!

Chakravarthi Kalyan
కరోనా.. మన జీవితాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రభావం చూపిన పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కోట్ల మంది జీవితాల్లో మార్పులు తెచ్చింది. ప్రపంచమే ఓ కుదపుకు లోనైంది. ఉన్నపళంగా ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాలు ఉన్న వారు సైతం చాలా వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పాటించాల్సి వచ్చింది. ఇలా ఎన్నో మార్పులు.. అయితే.. కరోనా తెచ్చిన మార్పుల్లో ఇప్పుడు ఉద్యోగుల్లో ఓ కొత్త మార్పు వస్తోంది. అదే ఇప్పుడు అగ్రదేశాలను సైతం వణికిస్తోంది.


ఆ మార్పే ది గ్రేట్ రిజిగ్నేషన్..అంటే ఉద్యోగాలు వదిలేయడం.. అవును.. కరోనా తర్వాత ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందట. ఉద్యోగాలు చేయడం కంటే.. సొంత ఉపాధి వెతక్కోవడం పై కొందరు దృష్టి పెడుతున్నారట. మరికొందరు.. కొత్త ఉద్యోగం వెదుక్కుంటున్నారట. ఇలా ఉద్యోగాలకు రాజీనామా చేయడం కొన్ని దేశాల్లో సునామీ స్థాయిలో ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. కరోనా పుణ్యమా అని చాలా మందికి కుటుంబం విలువ తెలిసొచ్చింది. డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలిసివచ్చింది.


అందుకే.. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు వదిలేస్తున్నారట. మంచి జీతాలు, ప్యాకేజీలు ఇస్తామని ఇప్పుడు కంపెనీలు ప్రకటిస్తున్నా చాలామంది ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నారట. గతంలో ఉద్యోగం వదిలేస్తే బతకలేం అనే భయం ఉన్న వారు కూడా ఇప్పుడు ధైర్యంగా  ఉద్యోగాలు వదిలేసి కొత్త అవకాశాలు వెదుక్కుంటున్నారట. ఇప్పుడు దీన్నే ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ సంక్షోభంగా చెప్పుకుంటున్నారు.


ప్రత్యేకించి రిటైల్‌, గోదాములు, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్‌ విభాగాల్లో మాత్రం రాజీనామాలు భారీగా ఉంటున్నాయట. ఎందుకంటే.. ఈ రంగాల్లో ఇప్పటికీ చాలా తక్కువ జీతాలు ఉన్నాయి. ఈ ఒత్తిడితో ఇంత తక్కువ జీతానికి పని చేయడం కంటే.. మానేయడం బెటర్ అనుకుంటున్నారట ఉద్యోగులు. ఇక అమెరికాలో అయితే మహిళలు  ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారట. అమెరికాలోనే  ఆగస్టులో 43 లక్షల మంది ఉద్యోగాలు వదిలేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: