మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబుకు నోటీసులు ఇచ్చాం : డీఐజీ

విశాఖ రేంజ్ డిఐజి రంగారావు గంజాయి స‌మ‌స్య పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. గత రెండు మూడు వారాలుగా ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖ‌కు వస్తున్నారని అన్నారు. గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవాడానికి పోలీసులు ప్రయత్నలు చేస్తున్నారని చెప్పారు. అయితే స్థానిక పోలీసుల సహకారంతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయ‌న అన్నారు. కానీ నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదని ...దాని వల్ల ఈ సమస్య లేవనెత్తిందని చెప్పారు. కేరళ , తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల పోలీసులు సైతం గంజాయి నిందితుల కోసం వస్తున్నార‌ని తెలిపారు .
ఈ విషయం పై మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు కొన్ని విషయాలు మాట్లాడారని డీఐజీ చెప్పారు. మాఫియా ఉందన్నారు..ఆ విషయాలు చేప్పాలి..అని డీఐజీ రంగారావు నిల‌దీశారు. దీనిపై ఆయన మాట్లాడిన విషయాలపై పూర్తి వివరాలు ఇవ్వమని అడిగామని..ఆయన ఇవ్వలేక పోయారని చెప్పారు. అంతే కాకుండా  ఆయన ఓ సాక్షిగా సీఆర్పిసీ 160 ప్రకారం నోటీసులు కూడా ఇచ్చామని వ్యాఖ్యానించారు. గంజాయి అనేది ఇప్పుడు పుట్టికొచ్చింది కాదని ... దీనిపై ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము కేసులు నమోదు చేసాము అంటూ డీఏజీ వెల్ల‌డించారు .
అన్ని శాఖలు గంజాయి నివారణ కోసం కష్టపడుతున్నయ‌ని ..ప్రభుత్వం గంజాయి నివారణ కోసం  ప్రయత్నం చేస్తుందని డీఐజీ స్పష్టం చేశారు.  గంజాయి గురించి ఎలాంటి సమచారం ఉన్నా అందించాల‌ని ఇది కేవలం పోలీసుల బాద్యత మాత్రమే కాదు సమాజిక బాద్యత కూడా అని డీఐజీ చెప్పారు . అంతే కాకుండా గంజాయి పంటలను సైతం నిర్మూలన చేస్తామ‌ని డీఐజీ హామీ ఇచ్చారు . ఇదిలా ఉండ‌గా తెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో గంజాయి పొగ‌లు గుప్పుమంటున్న సంగ‌తి తెలిసిందే . న‌గ‌రాలు ప‌ట్ట‌ణాలు ప‌ల్లెల్లో కూడా యువ‌త గంజాయికి అల‌వాటు ప‌డుతూ భ‌విష‌త్తును నాశ‌నం చేసుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: