పోలీసన్నకి సలాం.. ప్రాణాలను సైతం లెక్క చేయని ఖాకీలు?

praveen
సైనికులు దేశానికి రక్షణ కల్పిస్తూ ఉంటే అటు మనందరి మధ్య ఉంటూ రాత్రింబవళ్లు అందరికీ రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు.  ఇక విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు అర్పించిన వాడు కూడా ఉన్నారు. ఇలా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ.. ప్రజల మనుషులుగా ఉంటూ.. ఎంతో మంది పోలీసులు తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. ఇలా ప్రతి క్షణం ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటివరకు విధినిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరమరణం పొందిన వారు ఉన్నారు.

 అలాంటి పోలీసులు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశ వ్యాప్తంగా 2020 సెప్టెంబర్ 1 నుండి 2021 ఆగస్టు 31 వరకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులు.. రాష్ర్టాల వారీగా..
ఆంధ్రప్రదేశ్ లో 11 మంది, అరుణాచల్ ప్రదేశ్ లో ముగ్గురు, అస్సాంలో 7 గురు, బీహార్ లో ఆరుగురు, ఛత్తీస్‌ఘడ్ 32 మంది,
హిమాచల్ ప్రదేశ్ లో నలుగురు, జార్ఖండ్ లో నలుగురు, కర్ణాటక లో 16 మంది, కేరళలో ఇద్దరు, మధ్యప్రదేశ్ లో 15 మంది, మణిపూర్ లో ముగ్గురు, మేఘాలయలో ఒక్కరు, ఒడిస్సా లో నలుగురు, పంజాబ్ లో ఇద్దరు, రాజస్థాన్ లో ఇద్దరు, తెలంగాణ లో 72 మంది, తమిళనాడులో ఒక్కరు, ఉత్తర్‌ప్రదేశ్ లో నలుగురు, ఉత్తరాఖండ్ లో ముగ్గురు, వెస్ట్ బెంగాల్ 17 మంది, అండమాన్ నికోబార్ లో ఇద్దరు, చండీగఢ్ లో ఇద్దరు, ఢిల్లీ లో ఆరుగురు, kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">జమ్మూ అండ్ కాశ్మీర్ లో 17 మంది, లఢాఖ్ లో ఒక్కరు,  అస్సాం రైఫిల్స్ లో 50 మంది, సీఐఎస్ఎఫ్ లో 90 మంది, ఐటీబీపీలో 54 మంది, ఎన్ఎస్‌జీ లో ఒక్కరు, ఎస్ఎస్‌బీ లో ఐదుగురు, ఎఫ్ఎస్,సీడి అండ్ హెచ్ జీ లో ముగ్గురు, ఎన్‌డీఆర్ఎఫ్‌ లో ఒక్కరు, ఆర్‌పీఎఫ్ లో ఎనిమిది మంది..  ఇలా ఎంతో మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజా రక్షణ కోసం ప్రాణాలు వదిలారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: