బోసడికే అంటే అసలు అర్థం ఏంటి... టీడీపీ, వైసీపీ అర్థాలు ఇవే..!
ఇక అదే టైంలో ఏపీ లో పలు జిల్లా లలో టీడీపీ కార్యాలయాలపై సైతం దాడులు జరిగాయి. సీఎం జగన్ సైతం వాళ్ల మాటలు చూస్తుంటే మా వాళ్ల బీపీ పెంచేలా ఉందని.. అందుకే మా వాళ్లు కాస్త రెచ్చి పోయారంటూ పరోక్షంగా ఆ మాట లను ప్రోత్సహిస్తున్నట్టు గా మాట్లాడారు. అయితే దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. చివరకు ఆయన గూగుల్ తల్లిని ఆశ్రయించి ఈ పదం అర్థం కనుక్కున్నారట.
ఆయన చెప్పిన దాని ప్రకారం బోసడికే అంటే సర్.. మీరు బాగున్నారా అని అర్ధమని రఘురామ చెప్పారు. అది సంస్కృత పదమని ఆయన చెప్పుకు వచ్చారు. ఇక టీడీపీ విప్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సైతం బోసడికే పదం తిట్టు కాదని .... ఇది గుజరాత్ లో ఒక ఊరి పేరని.. దానినే పట్టాభి చెప్పారని అన్నారు. ఏదేమైనా ఈ పదానికి ఎవరికి తోచినట్టు గా వారు అర్థం చెప్పుకుంటున్నారు. మరి మిగిలిన వారు ఈ పదానికి ఏం కొత్త అర్థాలు చెపుతారో ? చూడాలి.