పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి మూడిందా..ఏం..!

MOHAN BABU
ఉగ్రవాదులను తయారు చేస్తూ దేశాన్ని శాసించే పాకిస్తాన్ ఆర్మీతో 2020 స్టార్ట్ చేసాడా. ఆర్మీ చీఫ్ చేతిలో క్లీన్ బోల్డ్  ఖాయమా, లేదా హిట్ వికెట్ తోనే ఇంటిదారి పడతాడా. సడన్ గా ఇమ్రాన్ ఖాన్ పదవిపై చర్చ ఎందుకు మొదలైంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం చేసినా పరువు పోతుంది. మొన్న ప్రధాని నివాసానికి టూలేట్ బోర్డు పెట్టేసి గేదెలు, కార్లను  వేలానికి పెట్టినా ప్రతిపక్షాలే కాదు, జనం కూడా ఇదేం కర్మ రా బాబూ అంటూ తల పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మరో తిట్ల వర్షం తో నిలువెల్ల తడుస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ . దేశాధినేతలు అందజేసిన బహుమతులను ఇమ్రాన్ ఖాన్ అమ్ముకుంటున్నారని పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు టన్నుల కొద్ది విమర్శలు వస్తున్నాయి.  ఓ గల్ఫ్ దేశం యువరాజు ఇచ్చిన గడియారాన్ని  అమ్మేసి సుమారు ఏడు కోట్ల నలభై లక్షలు జేబులో వేసుకున్నాడన్న విమర్శలతో ఇమ్రాన్ ను  కుళ్ళబొడిచేస్తున్నారు నేతలు.

 సిగ్గుచేటైన వ్యవహారంఅని మోహం చిట్లిస్తున్నారు. ఈ రచ్చ పక్కన పెడితే పోయి పోయి పాకిస్తాన్ ఆర్మీ ని గిల్లి లేపి తన సీటుకే ఎసరు పెట్టుకుంటున్నారు ఇమ్రాన్ ఖాన్. ఒక ఫోటో పాకిస్తాన్ ప్రధాని, ఆ దేశ ఆర్మీ  చీఫ్ మధ్య విభేదాలకు రిబ్బన్ కట్ చేసింది. ఆఫ్ఘన్ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు, ఆఫగానీలు తన్నుకుంటున్న సమయంలో ఆ ఫోటో కలకలం రేపింది. పాక్ నేరుగా ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకొని తనకు అవసరమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పాక్ ఆర్మీ చీఫ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం అసలు మంట రేపింది. తాలిబన్ల వెనక ఐఎస్ఐ ఉందన్న విషయం బహిర్గతం కావడమే ఇందుకు కారణం. తన అనుమతి లేకుండా ఐఎస్ఐ చీఫ్ దేశం దాటడం పై నోటీసులు జారీ చేసి పంచాయతీ పెట్టారు. చివరకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో విచారణ జరిపి ఫయాజ్ చేత క్షమాపణలు చెప్పించారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ వ్యవహారం ఇమ్రాన్ ఖాన్ కు అస్సలు నచ్చడం లేదు. ఇమ్రాన్ పాలన కూడా ఆర్మీ చీఫ్ కు పొసగడం లేదు. ఉగ్రవాదులను పోషించేది,

ఐఎస్ఐ ని చెప్పుచేతల్లో పెట్టుకునేది, పిమ్ ఓ ని గ్రిప్లో పెట్టుకునేది పాకిస్తాన్ సైన్యమె. గతంలో జరిగిన సంచలన పరిణామాలె అందుకు నిదర్శనం. ఇమ్రాన్ ఖాన్ కు ఆర్మీ చీప్ కు యుద్ధం మొదలైందని ఇది ఏ క్షణమైనా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి గండం తప్పదని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: