కేసీఆర్ Vs. ఈటెల : భార్య క్యాస్ట్ దెబ్బ - ఈటెల అబ్బా ?
ఆయన బీసీ అని పైకి చెప్పుకుంటూ లోపల మాత్రం రెడ్లతోనే ఉంటూ బీసీలను అణగ దొక్కుతున్నారన్న విషయాన్ని అధికార పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లింది. ఆయన తన భార్య జమునా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ విషయంలో ఎవ్వరికి ఇబ్బంది లేదు. అయితే ఆయన కుమారుడు, కుమార్తె ఇద్దరికి రెడ్లతో పెళ్లి చేసి .. వారి పేర్లు కూడా రెడ్డి అని పెట్టడం చూస్తే ఆయనకు కూడా బీసీగా ఉండడ ఇష్టం లేదన్న ప్రచారం ఇక్కడ బలంగా జరిగింది.
పాడి కౌశిక్ రెడ్డి ఈ విషయంపై గట్టిగా ఫోకస్ చేశారు. ఈటల హైదరాబాద్ లో ఉన్నప్పుడు రెడ్డిగా ఉంటారని. ఆయన సిద్ధిపేట, గజ్వేల్ వరకు రాగానే రెడ్డిగానే ఉంటారని. అదే కరీంనగర్ జిల్లాలోకి ఎప్పుడు ఎంటర్ అవుతారో అప్పటి నుంచే హుస్నాబాద్, హుజూరా బాద్‌కు వచ్చే సరికి ఆయన బీసీ అయిపోతారని ఎద్దేవా చేశారు. ఇక హుజూరాబాద్ లో బలంగా ఉన్న ఈటల క్యాస్ట్ లో కూడా ఈ విషయాలు బలంగా నాటుకున్నాయి. ఇవి ఇప్పుడు ఆయనకు ఎంత వరకు మైనస్ అవుతాయన్న చర్చలు కూడా ఉన్నాయి.