పులి వేషం వేస్తే పులులు కారు..రేవంత్ పై జగదీష్ ఫైర్ !

Veldandi Saikiran
నల్లగొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  వ్యాఖ్యల పై తీవ్ర స్థాయి లో ఫైర్ అయ్యారు తెలంగాణ  రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. చెత్త గాళ్ల కు వచ్చేదే చెత్త ఆలోచనలు, జోకర్లు, బ్రోకర్లలా మాట్లాడడం వారి విజ్ఞత కు వదిలేస్తున్నట్లు నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్‌ రెడ్డి. జీవితం లో ఒక్క రోజై నా బాధ్యతా యుతంగా పని చేయని వారికి ఏమి తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్‌ రెడ్డి.  అసలు నీకు పదవి ఎలా వచ్చిందో నీ పార్టీ వారే బహిరంగం గా చెబుతున్నారని ఆగ్రహించారు మంత్రి జగదీష్‌ రెడ్డి.  


టిఆర్ ఎస్  పార్టీ  క్యాడర్ లో నూతన ఉత్తేజం చూసి రేవంత్‌ రెడ్డి కి మతి భ్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్‌ రెడ్డి.  పెద్దా యన ను తిడితే పెద్దలు కాలేరు, పెద్దలను అనుకరిస్తేనే పెద్ద వాళ్ళం అవుతామని చురకలు అంటించారు మంత్రి జగదీష్‌ రెడ్డి.  పులి వేషం వేస్తే పులులు కారు, చిల్లర మాటలు మానుకోవాలి, ఆ భాష మాకు వచ్చని ఎద్దేవా చేశారు మంత్రి జగదీష్‌ రెడ్డి. ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోందన్నది గమనించాలన్నారు
.


సిఎండి ప్రభాకర్ రావు నివేదిక ఎక్కడ ఇచ్చారు, ఏ ఏ అధికారులు ఎక్కడికి పోతున్నారో నీకు చెప్పాలా ? అని  ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి....  మాటలు అసలు పనికి రానివని...  ఆయనను ఎవరూ కూడా పట్టించు కోకూడాదని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు మంత్రి జగదీష్‌ రెడ్డి. రేవంత్‌ రెడ్డి మాట్లాడే ప్రతి మాట చిల్లరేనని నిప్పులు చెరిగారు. మొదట హుజురాబాద్‌ నియోజక వర్గం లో కాంగ్రెస్‌ పార్టీ డిజాపిట్‌ తెచ్చుకోవాలని చురకలు అంటించారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: