ఉస్మానియా జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఆందోళ‌న..!

N ANJANEYULU
ఉస్మానియా ఆసుప‌త్రికి  ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది. ఎంతో మంది నిరుపేదలకు వైద్యం అందిస్తూ కొనసాగింది.  ఉస్మానియా లో ఏ గోడ ఎప్పుడు కూలుతుందో.. ఏ ఫ్యాన్ ఎప్పుడు ఎక్క‌డి నుంచి ప‌డుతుందోన‌ని భ‌యంతో బ‌తుకున్నారు. ఆసుప‌త్రి శిథిలావస్థ‌కు చేర‌డంతో ఈ మ‌ధ్య కురిసిన వర్షానికి కొన్ని చోట్ల భ‌వ‌నంపై చిలుకులు కూలి ఎంతో మంది రోగుల‌కు, డాక్ట‌ర్ల‌కు సైతం గాయాలు అయ్యాయి. ఇటీవ‌ల ఉస్మానియా ఆసుప‌త్రిలో ఫ్యాన్ ఊడి విధులు నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్‌పై ప‌డిన విష‌యం విధిత‌మే. ఉస్మానియా ఆసుప్ర‌తిలో విధులు నిర్వ‌హిస్తున్న జూనియ‌ర్ డాక్ట‌ర్లు బుధ‌వారం ఆందోళ‌న నిర్వ‌హించారు

ప్ర‌స్తుతం భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం కట్టి పేద రోగులకు అండగా ఉండాలని కోరుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకు ఏమైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యత వ‌హిస్తారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నూతన భవనం నిర్మించాలి. మెడికల్ కాలేజీలో వసతులు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన మెడికల్ క‌ళాశాల తీసుకురావడం పై మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అన్ని మెడికల్ కాలేజీలలో స్టాఫ్ తో పాటు, అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గాంధీ ఆస్పత్రి అంత పెద్దది అయినా వైద్య పరికరాలు లేవని, నిరుపేదలకు ఎలా వైద్యం అందించాలని ప్ర‌శ్నించారు. నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తప్పా మరో దిక్కు లేదు. మనోమెంట్స్ హైద్రాబాద్ లో ఎన్నో ఉన్నాయి.   ఇప్ప‌టికే  కొందరు కోర్టులో కేసు వేశారు.  ప్రభుత్వం  ముందుకు వచ్చి  నూతన బిల్డింగ్ నిర్మించాల‌ని కోరుతున్నారు.

కోవిడ్ స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా మేము విధులు నిర్వ‌హించాం. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లపై దాడులు చేస్తున్నారు.  ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి.  మేము ప్రజలకోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తాం. కార్పొరేట్ ఆసుపత్రిలో ల‌క్ష‌లు చెల్లించుకొని రోగి చనిపోయిన డబ్బులు కట్టి బాడీ తీసుకెళ్లాల‌ని పేర్కొంటారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి లేకుండా వైద్యం అందిస్తున్నాం. ప్రజలు మాత్రం డాక్టర్స్ పై దాడులు చేయడం సరికాదని వెల్ల‌డించారు జూనియ‌ర్ డాక్ట‌ర్లు.  ఆస్ప‌త్రిలో స‌రైన వ‌స‌తులు లేక‌పోతే వైద్యులు కార‌ణం కాదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నూత‌నంగా డాక్ట‌ర్ల‌ను రిక్రూట్‌మెంట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో రిక్రూట్ మెంట్ చేయ‌కుండా ఆపాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు అన్నీ వైద్య ప‌రిక‌రాలు, మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని కోరారు.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: