కూలీల‌కు డ‌బ్బులు ఎగ్గొట్టిన వైసీపీ ఎమ్మెల్యే...!

VUYYURU SUBHASH
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎంత త‌క్కువ  చెప్పుకొంటే అంతమంచిదా? ఎవ‌రికి ఎవ‌రూ తీసిపోరా?  ఒక‌రిని మించి మ‌రొక‌రు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను కావాల‌నే మూట‌గ‌ట్టుకుంటున్నారా?  ఈ విషయం తెలిసి కూడా.. అధిష్టానం మౌనంగా ఉంటోందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే గురించి.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న త‌ర‌చుగా వివాదాల్లోనూ ఉంటుంటారు. క‌రోనా స‌మ‌యంలో త‌న ప‌రివారాన్ని బెంగ‌ళూరు నుంచి తీసుకువ‌చ్చి.. పోలీసుల‌పై దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌నే వివాదంతో వార్త‌ల్లోకి వ‌చ్చారు.

బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌.. గత ఎన్నిక‌ల్లో దాదాపు 40 వేల పైచిలుకు.. మెజారిటీ సాధించి.. జిల్లాలోనే రెండో ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయితే.. ఎంత సాధిస్తే.. ఏంటి?  ఎంత ప్ర‌జామోదం ఉంటే ఏంటి..?  ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేన‌ప్పుడు అంటున్నారు ప్ర‌జ‌లు. ఎందుకంటే.. ప్ర‌తి రెండు నెల‌ల కోసారి.. స‌ద‌రు ఎమ్మెల్యే వివాదం అవుతున్నారు. స్థానికంగా ఉండ‌డం లేదేని.. త‌న వ్యాపారాల కోసం.. ఆయ‌న పొరుగు రాష్ట్రంలో ఉంటున్నార‌ని.. కొన్నాళ్లుగా ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఒక్క ప‌ని కూడా సాగ‌డం లేద‌ని అంటున్నారు.

ఇక‌, తాజాగా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేయించిన ఓ కాంట్రాక్టు ప‌నుల‌కు సంబంధించి.. కూలీల‌కు డ‌బ్బులు ఎగ్గొట్టార‌ని.. స‌ద‌రు ఎమ్మెల్యేపై వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి కూలీలు.. ఎమ్మెల్యే ఇంటి ముందు ధ‌ర్నాలు కూడా చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న వారికి ఇవ్వాల్సిన కూలీలు ఇవ్వ‌లేద‌ట‌. దీంతో ఈ విష‌యం.. ఏకంగా.. వైసీపీ అధిష్టానానికి చేరింది. అయితే.. దీనిపై ఎవ‌రూ.. కూడా స్పందించ‌లేదు.

నిజానికి అధిష్టానం స్పందించాలి క‌దా.. అనే ప్ర‌శ్న‌. కానీ, రాష్ట్రంలో ఇలాంటి వివాదాలు ఇంకా ఉన్నాయ‌ని.. అందుకే.. మౌనంగా ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. స‌ద‌రు ఎమ్మెల్యేపై మాత్రం వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మరి పార్టీ చూస్తూ..ఊరుకుంటుందా ?   లేక‌.. క‌ట్ట‌డి చేస్తుందా ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: