కేసీఆర్ VS ఈటెల : చంద్రబాబు దారిలో కేసీఆర్ !

RATNA KISHORE

చంద్ర‌బాబు గురువు అయితే కేసీఆర్ ఎవ‌రు శిష్యుడు.. క‌నుక గురువు దారిలో శిష్యుడు న‌డుస్తున్నాడు. వెన్ను పోటు రాజ‌కీయాల‌కు ఆద్యుడ‌య్యాడు. అన్న‌ది నేను కాదు రా ఈటెలే అంటున్నాడు.. అన్నానొక‌రితో! అవున‌వును! ఇదే నిజం. ఆ రోజు వెన్నుపోటు రాజ‌కీయం కార‌ణంగానే త‌న  నుంచి త‌న పార్టీనీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వినీ లాక్కున్నాడ‌ని చంద్ర‌బాబు గురించి చాలా బాధ‌ప‌డ్డాడు ఎన్టీఆర్. అలానే కేసీఆర్ కూడా వెన్నుపోటు రాజ‌కీయం కార‌ణంగానే ఇంత‌టి వాడ‌య్యాడ‌ని, త‌న ఉసురు ఊరికే పోద‌ని అంటున్నాడు ఈటెల. గెలుపు ఓట‌మి ఎలా ఉన్నా కూడా రాణించిన తీరే ఒక్క‌టి ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ప్రామాణికం కానుంది.

యుద్ధంలో వెన్నుపోటు రాజకీయం? ఉండాలా? వ‌ద్దా? ఉంటే ఎలా ఉండాలి..లేకుంటే ఎలా ఉండ‌కూడ‌దు. ఇవ‌న్నీ మాట్లాడాలి. మాట్లాడితేనే క‌దా తెలిసేది. మాట్లాడితేనే క‌దా గెలిచేది. ఈ యుద్ధంలో ఓడిపోయిన వారంతా ఎక్క‌డో ఓ చోట ఆగిపోయారు. లేదా ఓడిపోతున్న వారంతా ఎక్క‌డో ఓ చోట త‌మ‌ని తాము తెలుసుకోలేక‌పోతున్నారు. ఈ కార‌ణంగా జ‌న్మ‌లో ఒక‌రినొక‌రు న‌మ్మే ప‌రిస్థితే లేదు. ఒక‌రినొక‌రు విశ్వ‌సించే ప‌రిస్థితే లేదు. అందుకు కార‌ణాలు ఏమ‌యినా రాజ‌కీయంలో రాజ‌నీతిజ్ఞ‌త ఎంత‌న్న‌ది ఎవ‌రికి వారే తెలుసుకోవాలి. తెలుసుకున్నా ఎవ‌రి వారే త‌మ‌ని తాము నియంత్రించుకుని కొత్త యుద్ధం ఒక‌టి ప్ర‌క‌టించాలి.

ఇప్పుడు చంద్ర‌బాబు దారిలో కేసీఆర్ ఉన్నారు. అవును ఉన్నార‌నే అనిపిస్తోంది. వెన్ను పోటు రాజ‌కీయాల‌కు కేరాఫ్ గా ఉన్నార‌ని ఈటెల కూడా అన్నారు. ఈటెల అలా వ్యాఖ్యానించ‌డం నిజంగానే బాధాక‌రం. ఆయ‌న ఉద్య‌మ స‌హ‌చ‌రుడు. సుదీర్ఘ కాలం కేసీఆర్ కు న‌మ్మిన బంటుగా ఉన్నవాడు. ఆయ‌నే అలా అంటే ఇంక ఎవ్వ‌రిని కేసీఆర్ శ్రేణులు న‌మ్మాలి. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చీలిక‌కు కార‌ణం కావొచ్చు. వాస్త‌వానికి ఓ స‌మ‌యంలో ఓ సంద‌ర్భంలో ఈటెల కూడా బీజేపీని న‌మ్ముకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల నేత‌లు, క‌మ్యూనిస్టు భావాలున్న ఈటెల‌కు ఇప్పుడు ప్రాణ సంక‌టంలా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: