సోనియా చెంత యూత్ మంత్ర.. వర్కౌట్ అవుతుందా..!

MOHAN BABU
అప్పుడే జింకను వేటాడి ఆరగించి వచ్చిన సింహం శాకాహారం ఆరోగ్యానికి మంచిది అంటూ అడవిలో జంతువులకు క్లాస్ తీసుకుందట . 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలో 75 ఏళ్ల వయసున్న అధ్యక్షురాలు యువత గురించి మాట్లాడడం కూడా సరిగ్గా అలాగే ఉంది. సోనియాగాంధీ అధ్యక్షతన ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జులు, పిసిసి అధ్యక్షులతో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో సోనియాతో సహా సీనియర్లంతా కలిసి తమ వయస్సు తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే పార్టీ లోకి యువరక్తాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు రెండున్నర ఏళ్ల సమయం చాలా ముఖ్యం. 2024లో సత్తా చాటకపోతే 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ చరిత్రలో పేజీ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే  వ్యూహాలు రచిస్తోంది. విజయం కోసం ప్రతి మార్గాన్ని అన్వేషిస్తుంది.


ఎవరితో కలవాలి, ఎవరిని కలుపుకోవాలి అని లెక్క లేస్తోంది. కొత్తగా యూత్ మంత్రం జపిస్తూంది. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించికుంది. కాంగ్రెస్ అంటేనే సీనియర్ అలాంటిది ఈ మార్పెంటి..? ఇప్పటివరకు యువత కాంగ్రెస్ వైపు చూడలేదా..? లేదా కాంగ్రెస్ పార్టీ యువతను పట్టించుకోలేదా..? సోనియా అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో గట్టి నిర్ణయాలే తీసుకుంది. యువతకు పెద్దపీట వేయాలని, స్ట్రాటజీ లు  మార్చాలని డిసైడ్ అయ్యారు. సీనియర్ల మాటే వేదమన్నట్లుగా భావించే సోనియా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక  కారణం ఏంటి అన్నది పార్టీలో 70 ఏళ్లు పైబడిన నాయకులకు కూడా అంతుచిక్కడం లేదు.


 నిజానికి గాంధీ కుటుంబం చుట్టూ ఉండే సీనియర్ బ్యాచ్ మేధావులే కావచ్చు. వారు క్షేత్రస్థాయిలో ఎంత ఎఫెక్ట్ చూపిస్తారన్నదానిపైనే  పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పది ఓట్లు రాబట్టలేరు, పది అడుగులు ముందుకు వేయలేరు అన్న విమర్శలు ఆ పార్టీ ఆఫీస్ నుండే వినిపిస్తున్నాయి. అలాంటిది సోనియా ఇన్నాళ్లకు కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: