హుజురాబాద్ ఉప ఎన్నిక. ప్రస్తుతం భారతదేశం మొత్తం ఈ యొక్క ఎన్నికలపైనే కన్నేసి ఉంచింది. మొత్తం దేశంలో ఇప్పటివరకు చాలా ఉప ఎన్నికలు జరిగాయి. కానీ
హుజురాబాద్ ఉప ఎన్నిక అంతా పేరు మాత్రం సంపాదించలేదు అని చెప్పవచ్చు. ప్రస్తుతం 30 వ తేదీన మన పక్క రాష్ట్రమైన
ఏపీ బద్వేల్ లో ఉప ఎన్నిక జరుగనుంది. కానీ దీని గురించి కూడా అంతగా జోరు కనిపించడం లేదు. ఎందుకు..?
హుజురాబాద్ ఉప ఎన్నికే అంత గొప్పదా.. లేదా
హుజురాబాద్ ఉప ఎన్నికను అంత గొప్పగా మలిచారా.. అసలు హుజురాబాద్లో ఏం జరుగుతోంది..?
హుజురాబాద్ ప్రజల మనసులో ఏముంది..? ఎవరి పేజీ చిరగబోతోంది. తెలుసుకుందాం..?
హుజురాబాద్ లో దాదాపు రెండు నెలల నుంచి ఓవైపు ఈటల, మరోవైపు గెల్లు
శ్రీనివాస్ వారి యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అటు
బిజెపి పార్టీ నుంచి ఈటెల వర్గం వారు
కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర అతిపెద్ద నాయకులతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
అటు టిఆర్ఎస్ హరీష్ రావు అన్నీ తానై ప్రచారంలో మునిగిపోయారు. ఇక చివరి సమయంలో ఉత్కంఠ మధ్య
కాంగ్రెస్ నుంచి యువ నాయకుడు బల్మూర్
వెంకట్ బరిలో నిలిచారు. ఈయన కోసం పిసిసి అధ్యక్షులు
రేవంత్ రెడ్డి తో సహా పార్టీలోని సీనియర్ నాయకులంతా ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉండగా అతను
హుజురాబాద్ లో ఇప్పటివరకూ
ఈటల రాజేందర్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆయనకు దాదాపు లక్షా ఐదువేల ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన
కాంగ్రెస్ అభ్యర్థి పాడి
కౌశిక్ రెడ్డి కి 61,121 ఓట్లు వచ్చాయి. దాదాపు 45 వేల తేడాతో
ఈటల రాజేందర్ గెలుపొందారు. ఆయన అప్పుడు టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఇన్ని ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఆయన టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరారు. కానీ గతంలో ఎప్పుడూ కూడా
బిజెపి అక్కడి ప్రజలకు అంత పరిచయం ఉన్న
పార్టీ కాదు. ప్రస్తుతం ఈటెల చేరికతో ఆ
పార్టీ ఎక్కడ ఆదరణలోకి వచ్చింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం ఎక్కువగా పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చే స్వభావం కలవారని సమాచారం. అదే ప్రస్తుత పరిణామంలో గెల్లు
శ్రీనివాస్ కెసిఆర్ తరపున పోటీ చేసిన అభ్యర్థి.
ఈటల రాజేందర్ బండి సంజయ్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి. ప్రస్తుత పరిణామంలో అక్కడి ప్రజలకు
కేసీఆర్ అంటే ఎక్కువ అభిమానం. ఇటు ఈటెలపై కూడా అభిమానం ఎక్కువ.
దీంతో అక్కడి ఓటర్లు ఓటు ఎవరికి వేయాలో డైలమాలో పడుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ లెక్కను బట్టి చూస్తే గతంలో టిఆర్ఎస్ కు పడ్డ ఓట్లను ప్రస్తుతం ఈటెల గెల్లు
శ్రీనివాస్ లకు సమపాళ్లలో పడవచ్చని తెలుస్తోంది. అయితే
హుజురాబాద్ లో ఇప్పటికి
కాంగ్రెస్ క్యాడర్ కూడా ఉన్నది. గతంలో
కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి పార్టీ. అక్కడ కాంగ్రెస్కు ఓట్లు కూడా బలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో అభ్యర్థి బల్మూరి
వెంకట్ కూడా ఎక్కువగా ఓట్లు రాబట్టే అవకాశం ఉన్నది. ఒకవేళ
బిజెపి, టిఆర్ఎస్ లకు సమపాళ్ళలో ఓట్లు వస్తే
కాంగ్రెస్ క్యాడర్ తో బల్మూర్
వెంకట్ కూడా గెలిచే అవకాశం కనిపిస్తుందని సమాచారం. ఏది ఏమైనా
హుజురాబాద్ ప్రజలు ఓటు వేయడంలో చాలా సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.